Rain Alert: ఒకేసారి రెండు తుఫాన్లు..! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Updated on: Oct 23, 2023 | 11:22 AM

Two Cyclones Affect On AP - Telangana: దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు దూసుకొస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్‌ తుఫాన్‌, మరోవైపు బంగాళాఖాతంలో హమూన్‌ తుఫాన్‌ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తేజ్‌ తుపాన్‌ అక్టోబరు 22న తీవ్ర తుఫానుగా మారి యెమెన్‌-ఒమన్‌ తీరాల వైపు పయనిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.

1 / 6
దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు దూసుకొస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్‌ తుఫాన్‌, మరోవైపు బంగాళాఖాతంలో హమూన్‌ తుఫాన్‌ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం  వెల్లడించింది.

2 / 6
 తేజ్‌ తుపాన్‌ అక్టోబరు 22న తీవ్ర తుఫానుగా మారి యెమెన్‌-ఒమన్‌ తీరాల వైపు పయనిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ తుఫాన్‌ వాయువ్య దిశగా కదిలి, ఆల్‌గైదా, సలాలా  మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది.

3 / 6
వీస్తాయని తెలిపింది. తీరరేఖకు ఇరువైపులా ఒకేసారి రెండు తుఫానులు సంభవించడం చాలా అరుదని వాతావరణ నిపుణులు తెలిపారు. 2018లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.

4 / 6
హమూన్‌ తుఫాను బంగ్లాదేశ్ తీరం దిశగా కదులుతోందని వెల్లడించింది. మరి కొన్ని గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, కేరళ, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

5 / 6
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

6 / 6
ఇక ఈశాన్య రుతుపవనాల ఆగమనాన్ని ఖరారు చేస్తూ తమిళనాడులో అక్టోబరు 21 నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోనూ రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది.