
పేదవాళ్ల బ్రేక్ ఫాస్ట్ కు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు చద్దన్నం, ఒక కప్పు పెరుగు, రెండు బంగాళాదుంపలు, రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, నాలుగు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు , రెండు ఎండు మిర్చి, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

బంగాళాదుంపలను ఇలా ఫ్రై చేసుకోవాలి: ముందుగా బంగాళా దుంపలు బాగా ఉడకబెట్టి, దాని మీద తొక్కను తీసి, దానిని ఒక ప్లేట్ లేదా చిన్న గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తరవాత చిన్న పాన్ తీసుకుని ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి బాగా వేయించాలి.

ఆ తర్వాత దీనిలో నాలుగు పచ్చిమిర్చి, చిన్న అల్లం, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి దానిలో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బంగాళాదుంప ముక్కలు కూడా వేసి, రుచికి తగినంత ఉప్పును వేసి బాగా మూత పెట్టి మీడియం మంటపై గోల్డ్ కలర్లోకి మారే వరకు స్టవ్ మీదే పెట్టి బాగా వేయించాలి.

ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో చద్దన్నం తీసుకుని దానిని కలుపుకుని దానిలో ఒక కప్పు పెరుగు, ఆ తరవాత కొద్దిగా ఉప్పు, ఇంకా దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చిన్న పాన్‌లో పోపు పెట్టి దీనిలో కలిపి వేడి వేడి బంగాళాదుంప ముద్దను ఈ పెరుగు మిశ్రమంలో పెట్టుకుని ఉదయం తింటే చాలా మంచిది.

కొందరికి బంగాళాదుంపలు అస్సలు పడవు. ఎందుకంటే, వీటిని తిన్న తరవాత వాతం నొప్పులు వస్తాయి. కాబట్టి, వీరు తప్పకుండా వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)