Cucumber Water: కీరదోస వాటర్‌తో ఇన్ని లాభాలా! ఇలా తాగితే పొట్ట చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది

|

May 15, 2024 | 12:38 PM

వేసవిలో కీర దోస చాలా మంది ఎంతో ఇష్టం తింటారు. చర్మం, శరీరాన్ని చల్లబరచడానికి కీర దోస చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే కీర దోసలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీర బరువును తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. కీర దోస క్యాలరీలు లేని పండు. అందుకే దీన్ని రోజువారీ ఆహారంలో ఉంచుకోవచ్చు. కీర దోస నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చని ..

1 / 5
వేసవిలో కీర దోస చాలా మంది ఎంతో ఇష్టం తింటారు. చర్మం, శరీరాన్ని చల్లబరచడానికి కీర దోస చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే కీర దోసలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీర బరువును తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

2 / 5
కీర దోస క్యాలరీలు లేని పండు. అందుకే దీన్ని రోజువారీ ఆహారంలో ఉంచుకోవచ్చు. కీర దోస నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చని  చాలా మందికి తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీర దోస నానబెట్టిన నీటిని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల అధిక శరీర బరువు త్వరగా తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కనీసం రెండు గ్లాసుల కీర దోస నానబెట్టిన నీటిని తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

3 / 5
కీర దోస రసం శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. తప్పకుండా కీర దోస రసం తాగడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కీరదోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ప్రతిరోజూ ఉదయం దోసకాయ నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో శరీర బరువును తగ్గించడంలో పరోక్షంగా సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది.

4 / 5
కీర దోస నానబెట్టిన నీరు ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే నేటి కాలంలో చాలా రెస్టారెంట్లు భోజనం తర్వాత కీర దోస నీరు లేదా కీర దోస షర్బత్‌ వంటివి కస్టమర్లకు అందిస్తున్నాయి. కీర దోస షర్బత్‌ను ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. ముందుగా కీర దోస తొక్క తీసి సన్నగా గుండ్రంగా కట్ చేసి ఓ గ్లాసుడు నీటిలో వేయాలి.

5 / 5
కీర దోస నానబెట్టిన నీటిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత రోజూ ఉదయాన్నే ఈ నీటిలో కాసిన్ని నిమ్మకాయ చుక్కలు, పుదీనా ఆకులు, అల్లం ముక్కలను వేసి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయం తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గడమేకాకుండా కడుపుని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.