
జలుబు - ఆస్తమా: దోసకాయ శరీరంలో కఫ దోషాన్ని పెంచుతుంది. జలుబు, దగ్గు, శ్లేష్మం, సైనస్ లేదా ఉబ్బసం ఉన్నవారు దోసకాయను పూర్తిగా నివారించాలి. ముఖ్యంగా చలికాలంలో ఇది సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

కీళ్ల నొప్పులు: దోసకాయ కూలింగ్ ప్రభావం వాత దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇప్పటికే కీళ్ల నొప్పులు లేదా శరీరంలో వాపుతో బాధపడే సున్నితమైన వ్యక్తులలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

జీర్ణక్రియ - ఇతర సమస్యలు: కీర దోసకాయలో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి ఇది ఇబ్బంది కలిగిస్తుంది. ఇందులో ఉండే కుకుర్బిటాసిన్ అనే చేదు సమ్మేళనం వల్ల ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ ఉన్నవారికి గ్యాస్, ఉబ్బరం లేదా అజీర్ణం వంటి సమస్యలు రావొచ్చు.

మూత్ర సంబంధిత సమస్యలు: దోసకాయలో అధిక నీటి శాతం ఉండటం వలన ఇది సహజ మూత్ర విసర్జనను పెంచే లక్షణాల్ని కలిగి ఉంటుంది. మూత్ర విసర్జన సమస్యలతో బాధపడేవారు దీనిని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్ : దోసకాయలు సాధారణంగా డయాబెటిస్ రోగులకు సురక్షితమే. కానీ దోసకాయ గింజలు ఇన్సులిన్ లేదా గ్లూకోజ్ తగ్గించే మందులు తీసుకునేవారిలో సమస్యలు సృష్టించవచ్చు. పెద్ద మొత్తంలో గింజలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా తగ్గి వణుకు, తలతిరగడం వచ్చే ప్రమాదం ఉంది.

ముఖ్యమైన చిట్కాలు: నిపుణులు తరచుగా రాత్రి భోజనం తర్వాత దోసకాయలు తినకూడదని సలహా ఇస్తారు. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దాని అధిక నీటి శాతం నిద్రకు భంగం కలిగిస్తుంది. సున్నితత్వం ఉన్నవారు దోసకాయను పూర్తిగా నివారించడం లేదా చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.