
రాగిపిండి పకోడికి కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు రాగి పిండి, శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర,ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, సోడా ఉప్పు, నూనెను తీసుకోవాలి.

రాగిపిండి పకోడి తయారీ విధానం: ముందుగా రాగి పిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసి దానిలో శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకోండి. ఇంకా ఈ గిన్నెలో సరిపడా నీరు మాత్రమే పోయాలి ఎక్కువ పోస్తే జోరుగా ఉంటుంది. లేదంటే పిండి ఉండల్లాగా ఉంటుంది.

ఈ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో నీళ్లు వేసి పకోడీ మిశ్రమం లాగా చేసి పక్కన పెట్టుకోండి.

పకోడీలను ఇలా వేయించాలి : చివర్లో సోడా ఉప్పు కలుపుకోవాలి. ఇలా చేస్తే కర కర లాడుతాయి.ఇంకా గ్యాస్ వెలిగించి పాన్ లో అర కప్పు నూనె చేసి దీనిని తీసుకుని చిన్న ముద్దలుగా ఫ్రై చేయాలి. గోధుమ రంగు నుంచి గోల్డ్ కలర్లోకి మారే వరకు రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.

సాయంత్రం తింటే ఆ టేస్ట్ వేరు : వేడి వేడి పకోడీని పల్లీలు చట్నీతో తింటే రుచి సూపర్ ఉంటుంది. అయితే, ఉదయం కాకుండా సాయంత్రం 4 గంటల తరవాత యమా రుచిగా ఉంటుంది. టీ లో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా ప్లేట్స్ మీద ప్లేట్స్ ఆపకుండా తింటూనే ఉంటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు తింటూనే ఉంటారు.