Pesara Garelu: ప్రోటీన్ అధికంగా ఉండే పెసర గారెలు.. నూనె పీల్చకుండా.. కరకరలాడుతూ.. ఆహా

Updated on: Sep 01, 2026 | 5:49 PM

సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా క్రిస్పీ స్నాక్ తినాలనిపిస్తే ఎక్కువ ప్రొటీన్లు ఉండే పొట్టు పెసలతో చేసుకునే 'పెసర గారెలు' అద్భుతమైన ఎంపిక. సాధారణంగా మనం మినప గారెలు లేదా శనగపప్పు మసాలా వడలు చేస్తుంటాం. కానీ పూర్తి పెసలతో గారెలు వేస్తే వచ్చే కమ్మదనం, కరకరలాడే స్వభావం వేరుగా ఉంటుంది. నూనె ఏమాత్రం పీల్చకుండా, గట్టిపడకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండేలా గోదావరి-కోనసీమ సంప్రదాయ రుచుల్లో ఈ గారెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5
కావలసిన పదార్థాలు:  రెండు కప్పుల పొట్టు పెసలు, 3 అంగుళాల అల్లంముక్క, 6 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి , 2 - సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అర టీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు మరియు డీప్ ఫ్రైకి సరిపడా నూనె.

2 / 5
నానబెట్టడం, పిండి రుబ్బే విధానం: రెండు కప్పుల పెసలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు తప్పనిసరిగా నానబెట్టుకోవాలి. పెసలు త్వరగా నానవు కాబట్టి సరిగ్గా 6 గంటలు నానితేనే గారెలు గట్టిపడకుండా మృదువుగా వస్తాయి.

3 / 5
నానిన పెసలను శుభ్రంగా కడగాలి. ముందుగా మిక్సీ జార్‌లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్‌లో నానిన పెసలను వేసి కొద్దిగా మాత్రమే నీళ్లు పోసి రుబ్బుకోవాలి. పెసలు రుబ్బేటప్పుడు కొద్దిగా నీళ్లు చేర్చకపోతే పిండి మరీ గట్టిపడి గారెలు గట్టిగా వస్తాయి, కాబట్టి తగినంత తేమతో సమపాళ్లలో మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి.

4 / 5
మిశ్రమం కలపడం & గారెలు ఒత్తే విధానం: రుబ్బిన పెసర పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎక్కువ పరిమాణంలో కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక బటర్ పేపర్ లేదా పాలిథిన్ కవర్ తీసుకుని తడి చేయాలి. చేతిని నీటితో తడుపుకుంటూ చిన్న పిండి ముద్దను తీసుకుని సమాన మందంతో గుండ్రంగా ఒత్తి, మధ్యలో చిల్లు పెట్టాలి.

5 / 5
వేయించే విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె సమానంగా వేడయ్యాక గారెలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కాసేపు వేగిన తర్వాత తిప్పుతూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లోనే వేయించి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పెసర గారెలు సిద్ధం! వేయించిన పచ్చిమిర్చితో గానీ, టమాటా సాస్‌తో గానీ లేదా ఒట్టిగానే తిన్నా ఈ గారెలు అమృతంలా ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us