
కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు సెనగపిండి , రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు, నూనె, రెండు కప్పుల మజ్జిగ , ఒక చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం – ముక్క, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఎండు మిర్చి , కరివేపాకును తీసుకోవాలి.

ముందుగా బజ్జీలు తయారు చేసుకోవాలి : సెనగపిండిలో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సోడా, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి ముద్దలాగా చేసుకోవాలి. ఆ తరువాత ఆయిల్ వేసి బజ్జీలలాగా వేసుకోవాలి.

మజ్జిగ పులుసు ఇలా తయారు చేసుకోవాలి: కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని పాన్‌లో వేసి అర టేబుల్ పసుపు, ఉప్పు వేసి మీడియం మంట పై వేడి చేయాలి.

చివర్లో వేయించిన బజ్జీలను ఈ మజ్జిగలో వేసి 10 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఆ తర్వాత పాన్‌లో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఎండు మిర్చిని వేసి వేయించాలి.

ఈ పోపును తీసుకుని పులుసుపై పోయాలి. దీనిని వేడి అన్నంతో తింటే అదిరిపోతోంది. ఇక వేసవిలో ఈ రెసిపీ బెస్ట్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తినండి.