కేన్ మామ దెబ్బకు రోహిత్‌సేన విలవిల.! డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం ఏంటో తెల్సా.?

|

Feb 17, 2024 | 3:54 PM

దాదాపుగా 92 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయం సాధించింది న్యూజిలాండ్ జట్టు. ఇటీవల జరిగిన రెండో టెస్టులో గెలిచిన కివీస్.. తద్వారా సఫరీలపై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన న్యూజిలాండ్..

1 / 8
దాదాపుగా 92 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయం సాధించింది న్యూజిలాండ్ జట్టు. ఇటీవల జరిగిన రెండో టెస్టులో గెలిచిన కివీస్.. తద్వారా సఫరీలపై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

2 / 8
ఈ సిరీస్ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన న్యూజిలాండ్.. ఒక్కసారిగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరేందుకు టీమిండియాకు కాస్త కష్టతరం చేసింది.

3 / 8
రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించినా.. డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి చేరుకోలేదు భారత్ జట్టు. అయితే ఆస్ట్రేలియాను గద్దె దించి.. రెండో స్థానానికి ఎగబాకవచ్చు.

4 / 8
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండటంతో కివీస్ విజయ శాతం 66.66గా ఉంది. ఇప్పుడు రెండో టెస్టులో విజయం సాధించడంతో గెలుపు శాతం 75కి చేరుకుంది.

5 / 8
55.00 విజయశాతంతో కివీస్ తర్వాత ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక భారత జట్టు మూడో ర్యాంక్‌లో 52.77 విజయశాతంతో ఉంది.

6 / 8
ఇప్పుడు మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టును భారత్ ఓడిస్తే.. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాను ఓడించి నేరుగా రెండో స్థానానికి చేరుకుంటుంది. కానీ నంబర్‌వన్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటివరకు భారత్ 6 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. వాటిల్లో మూడింట గెలిచి.. రెండింటిలో ఓడింది.

7 / 8
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, టీమిండియా తర్వాత నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ 50 విజయశాతంతో ఉంది. ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పటివరకు ఆడిన ఐదు టెస్టుల్లో రెండింట్లో గెలిచి మూడింటిలో ఓడింది. ఆ జట్టు గెలుపు శాతం 36.66గా ఉంది.

8 / 8
రాబోయే రోజుల్లో అటు టీమిండియా మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌తో ఆడనుంది. అలాగే ఇటు న్యూజిలాండ్ కూడా మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఈ క్రమంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కచ్చితంగా మరిన్ని మార్పులు చూడవచ్చు.