IPL 2024: అత్యంత విధ్వంసకర జోడీ.. ఈ ఇద్దరు ప్లేయర్లు బరిలోకి దిగితే బౌలర్లకు వణుకే..

|

Mar 14, 2024 | 9:02 PM

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2024 సమరం ప్రారంభం కానుంది. మార్చి 22న చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

1 / 5
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2024 సమరం ప్రారంభం కానుంది. మార్చి 22న చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. గతేడాది బౌలర్లను శాసించిన అత్యంత విధ్వంసకర జోడీని మొదటి మ్యాచ్‌లోనే ఎదుర్కోనున్నాడు చెన్నై కెప్టెన్ ధోని.

2 / 5
గత ఏడాది బౌలర్లందరినీ శాసించిన విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి అదే జోరు కొనసాగించనున్నారు. కోహ్లీ, డుప్లెసిస్ కలిసి 939 పరుగులు జోడించి ఐపీఎల్‌లోనే అత్యంత విధ్వంసకర జోడీగా రికార్డు సృష్టించారు.

3 / 5
అటు విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో కలిసి అదే 939 పరుగులను జోడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి 2016 ఐపీఎల్ సీజన్‌లో ఈ ఘనత సాధించారు.

4 / 5
ఈ సీజన్‌లోనూ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ జోడీ.. బౌలర్లను మరోసారి వణికించేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి ఆ 939 పరుగుల రికార్డును వీరిద్దరూ మళ్లీ సమం చేస్తారని వినికిడి.

5 / 5
అయితే ఐపీఎల్‌లో ఓ ఇద్దరు భారత ఆటగాళ్లు.. అత్యధిక పరుగులు చేసిన జోడీగా పేరు గడించారు. వాళ్లే ధావన్, పృథ్వీ షా. 2021లో వీరిద్దరూ కలిసి 744 పరుగులు జోడించారు.