
వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కరేబియన్లపై ఇప్పటికే 9 శతకాలు కొట్టిన కోహ్లీ.. మరో సెంచరీ కొట్టి సంఖ్యను రెండంకెలకు చేర్చాలని భావిస్తున్నాడు.

1. విరాట్ కోహ్లీ: విండీస్ టీమ్‌పై మొత్తం 42 మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఏకంగా 9 వన్డే సెంచరీలు చేశాడు.

2. సచిన్ టెండూల్కర్: విండీస్‌పై 39 వన్డే మ్యాచ్‌లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 4 సెంచరీలు సాధించాడు.

3. యువరాజ్ సింగ్: కరేబియన్లపై 31 వన్డేలు ఆడిన యువరాజ్ 3 సెంచరీలు సాధించాడు.

4. రోహిత్ శర్మ: వెస్టిండీస్‌పై 36 వన్డేలు ఆడిన హిట్‌మ్యాన్ రోహిత్ 3 సెంచరీలు బాదాడు.

5. రాహుల్ ద్రవిడ్: టీమిండియా మాజీ కెప్టెన్ ద్రావిడ్ వెస్టిండీస్‌తో 40 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడి 3 సెంచరీలు కొట్టాడు.