Purple Cap: ఐపీఎల్ బ్యాటర్లకు చుక్కలు చూసిస్తోన్న టాప్ 5 బౌలర్లు.. లిస్టులో నలుగురు మనోళ్లే..

|

Apr 25, 2023 | 1:45 PM

ఐపీఎల్ 16వ సీజన్‌ ఇప్పటికే సగం వరకు చేరుకుంది. ఇక పరుగుల వర్షం కురిసే ధనాధన్ లీగ్‌లో వికెట్లు పడగొట్టడం అంటే మాములు విషయం కాదు. అలాగే టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టే ఆటగాళ్లకు పర్పుల్ క్యాప్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన టోర్నీలో అత్యధిక వికట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్న టాప్ 5 ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
పర్పుల్ క్యాప్ ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బైలర్ మహ్మద్ సిరాజ్ దగ్గర ఉంది. టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 28 ఓవర్లు వేసి మొత్తం 13 వికెట్లు తీసుకున్నాడు.

2 / 5
సిరాజ్‌తో పోటీ పడుతూ పర్పుల్ క్యాప్ రేసులో పంజాబ్ కింగ్స్ బౌలర్ ఆర్ష్‌దీప్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో 25 ఓవర్లు వేసిన ఆర్ష్‌దీప్ కూడా 13 వికెట్లు పడగొట్టాడు.

3 / 5
ఈ లిస్టులో యుజ్వేంద్ర చాహల్ కూడా ఉన్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో 3వ స్థానంలో ఉన్న చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున 7 మ్యాచ్‌లలో మొత్తం 28 ఓవర్లు వేసి 12 వికెట్లు తీశాడు.

4 / 5
బౌలింగ్‌లో సంచలన రికార్డులను కలిగిన రషిద్ ఖాన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున 6 మ్యాచ్‌లు ఆడిన రషిద్ ఈ లిస్ట్ నాల్గో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో అతను 24 ఓవర్లు వేసి 12 వికెట్లు పడగొట్టాడు.

5 / 5
ఇక ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్న టాప్ 5 ఆటగాళ్ల లిస్టులో తుషార్ దేశ్‌పాండే 5వ స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుగ్గా రాణిస్తున్న దేశ్‌పాండే 7 మ్యాచ్‌లలో 12 వికెట్లు పడగొట్టాడు. అతను కూడా 25 ఓవర్లు వేసి ఈ వికెట్లను పడగొట్టాడు.