
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది టీమిండియా. అయితే ఈ ఏడాది ముగిసేలోపు జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. వయస్సు, ఫామ్, ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా ముగ్గురు కీలక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 360 డిగ్రీల బ్యాటింగ్‌తో మెప్పించిన స్కై.. గత 25 టీ20ల్లో కేవలం 244 పరుగులు మాత్రమే చేశాడు. రెండేళ్లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత ఒకవేళ అతడి ఫామ్ అందుకోలేకపోతే, సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

భారత టెస్ట్ జట్టులో ఒక్కప్పటి నుంచి కీలక బ్యాటర్‌గా పేరొందిన అజింక్య రహానే పరిస్థితి కూడా ఇంతే. అతడు 2023 జూలై నుంచి టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లకు ఎక్కువగా ఛాన్స్‌లు ఇస్తుండటంతో రహానే పునరాగమనం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది అతడు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విషయానికొస్తే.. అతడు ఇప్పటికే టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టేందుకు జడేజా టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా 2026లో అతడు టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలు, యువ ఆటగాళ్ల రాకతో ఈ ముగ్గురి కెరీర్‌పై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. 2026 సంవత్సరంలో టీమిండియాలో మరో శకం మొదలయినట్టే.