IND vs NZ: 37 ఏళ్ల తర్వాత తొలిసారి.. టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?

Updated on: Jan 19, 2026 | 7:50 AM

Gautam Gambhir coaching criticism: భారత క్రికెట్ జట్టుకు స్వదేశంలో ఎదురుదెబ్బ తగిలింది. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అనూహ్యంగా ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్‌కే పరిమితం కాకుండా, జట్టులోని లోపాలను ఎత్తిచూపింది. అసలు టీమ్ ఇండియా ఎక్కడ తడబడింది? కివీస్ జట్టు పైచేయి సాధించడానికి గల ప్రధాన కారణాలు ఓసారి చూద్దాం..

1 / 6
ఒకప్పుడు భారత గడ్డపై ప్రత్యర్థి జట్లు అడుగుపెట్టాలంటేనే భయపడేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2024లో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్, ఇప్పుడు తాజాగా వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుని భారత్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. కివీస్ క్రమశిక్షణతో కూడిన ఆటతీరుకు, భారత జట్టు గందరగోళ వ్యూహాలు తోడవ్వడంతో పరాభవం తప్పలేదు. కెప్టెన్ గిల్ నాయకత్వం, కోచ్ గంభీర్ నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి.

2 / 6
సొంతగడ్డపై టీమ్ ఇండియాకు ఉన్న అజేయ రికార్డు క్రమంగా కరుగుతోంది. గతంలో భారత్‌లో సిరీస్ అంటే మనదే విజయం అన్న ధీమా ఉండేది. కానీ న్యూజిలాండ్ పర్యటన ఈ అంచనాలను తలకిందులు చేసింది. 16 సార్లు భారత్‌కు వచ్చి విఫలమైన కివీస్ జట్టు, ఈసారి చరిత్ర సృష్టించింది. 8 మంది కొత్త ఆటగాళ్లతో వచ్చినప్పటికీ, వారు చూపిన తెగువ ముందు భారత సీనియర్లు తేలిపోయారు.

3 / 6
బౌలింగ్ దారుణం.. రికార్డు స్థాయిలో పరుగులు: ఈ సిరీస్‌లో భారత బౌలింగ్ విభాగం అత్యంత బలహీనంగా కనిపించింది. పవర్ ప్లే ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం అతిపెద్ద లోపంగా మారింది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌లలో మన బౌలర్లు అత్యధికంగా (ఓవర్‌కు సగటున 6.2 పరుగులు) ఈ సిరీస్‌లోనే సమర్పించుకున్నారు. ముఖ్యంగా నమ్మదగ్గ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం, కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులివ్వడం జట్టును దెబ్బతీసింది.

4 / 6
బ్యాటింగ్ అస్థిరత్వం, ఫీల్డింగ్ తప్పిదాలు: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమవ్వడం, ఒత్తిడిలో వికెట్లు పారేసుకోవడం శాపంగా మారింది. వీటికి తోడు ఫీల్డింగ్‌లో ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేయడం భారత్ ఎంతటి గందరగోళంలో ఉందో తెలియజేస్తోంది. "క్యాచెస్ విన్ మ్యాచెస్" అన్న సూత్రాన్ని టీమ్ ఇండియా పూర్తిగా విస్మరించింది.

5 / 6
బోల్తా కొట్టిన గంభీర్ వ్యూహాలు: చీఫ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఆటగాళ్లను పదే పదే ప్రోత్సహించడం, అక్షర్ పటేల్ వంటి ప్రతిభావంతులను పక్కన పెట్టడం వ్యూహాత్మక తప్పిదాలే. ఆటగాడిగా దూకుడు ప్రదర్శించిన గంభీర్, కోచ్‌గా జట్టులో సమన్వయం తీసుకురావడంలో విఫలమవుతున్నాడనే వాదన వినిపిస్తోంది. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే టెస్టు సిరీస్‌లు కోల్పోయిన భారత్, ఇప్పుడు వన్డేల్లోనూ పరాజయం పాలవ్వడంతో అతనిపై ఒత్తిడి మరింత పెరిగింది.

6 / 6
న్యూజిలాండ్ విజయం వారి ప్రణాళికాబద్ధమైన కృషికి నిదర్శనం. అయితే, భారత ఓటమి మన అశ్రద్ధకు చిహ్నం. జట్టులో సమూల మార్పులు చేయకపోతే, స్వదేశంలో భారత్ కున్న 'లయన్' ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మేనేజ్‌మెంట్, కెప్టెన్ గిల్ ఇకనైనా వాస్తవాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.