
WTC Final Qualification Scenarios: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యం పాలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. పుణె, ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ మూడు పరాజయాలతో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లెక్క కూడా తలకిందులైంది.

ఎందుకంటే, న్యూజిలాండ్‌పై మూడు మ్యాచ్‌లు గెలిస్తే.. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో నేరుగా ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 15.91 శాతం పాయింట్లను కోల్పోయింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి కూడా పడిపోయింది.

అయితే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమించకపోవడం విశేషం. భారత జట్టు తదుపరి ఐదు మ్యాచ్‌ల్లో 4 గెలిస్తే ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. అంటే ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 4-0 తేడాతో గెలవాల్సి ఉంటుంది. దీని ద్వారా నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశించవచ్చు.

ఆస్ట్రేలియాతో జరిగే 1 లేదా 2 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోతే ఫైనల్స్‌లోకి ప్రవేశించాలంటే మిగిలిన జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సిందే. అంటే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న శ్రీలంక (55.56%), మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ (54.550%), నాలుగో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (54.17%) తదుపరి మ్యాచ్‌ల ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.

అందువల్ల భారత జట్టు నేరుగా ఫైనల్లోకి ప్రవేశించాలంటే ఆస్ట్రేలియా జట్టును 4-0 తేడాతో ఓడించాలి. 65.79% పాయింట్లు సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవచ్చు. దీంతో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల సిరీస్ టీమిండియాకు డూ ఆర్ డైలా మారింది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త స్టాండింగ్స్ (నవంబర్ 3, 2024): 1-ఆస్ట్రేలియా, 2-భారత్, 3-శ్రీలంక, 4-న్యూజిలాండ్, 5-దక్షిణాఫ్రికా.