Team India: సెమీస్‌కు చేరిన భారత్.. టోర్నీలో హర్మన్‌ప్రీత్ సేన ప్రస్థానం ఎలా ఉందంటే..?

|

Feb 21, 2023 | 3:31 PM

టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ 2లో 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా ప్రస్థానం ఈ టోర్నీలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1 / 6
మహిళల టీ20 ప్రపంచకప్‌ 2023లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఐర్లాండ్‌ను ఓడించడం ద్వారా భారత్‌ సెమీ ఫైనల్ టిక్కెట్‌ను ఖాయం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 6 పాయింట్లతో గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత్‌ ప్రయాణం అద్భుతంగా సాగింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ ఒక మ్యాచ్ మాత్రమే ఓడింది.

2 / 6
ఈ టోర్నీ లో తన మొదటి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి శుభారంభం చేసింది. పాకిస్థాన్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని జెమీమా రోడ్రిగ్స్ అజేయంగా 53 పరుగులతో భారత్ 3 వికెట్ల నష్టానికి సాధించింది.

3 / 6
వెస్టిండీస్‌పై కూడా విజయాల పరంపర కొనసాగించిన భారత్ కరీబియన్ జట్టు నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. దీప్తి 15 పరుగులకు 3 వికెట్లు తీయడంతో  6 వికెట్ల తేడాతో భారత్ ఈ విజయాన్ని అందుకుంది.

4 / 6
రెండు ఆరంభ మ్యాచ్‌ల్లోనూ గెలిచి టోర్నీలో తన దూకుడును ప్రదర్శించిన భారత జట్టుకు ఇంగ్లాండ్ చేతిలో ఎదురు దెబ్బ తగిలింది. తన మూడో మ్యాచ్‌లో భారత్‌ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.

5 / 6
 ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత, భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధాన 87 పరుగుల ఇన్నింగ్స్ ఆధారంగా 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసినప్పటికీ భారీ వర్షం కురిసింది. దీని తర్వాత ఐర్లాండ్‌కు 60 పరుగుల విజయ లక్ష్యం లభించగా, ఆ జట్టు భారత్ స్కోరు కంటే 5 పరుగులు వెనుకబడి ఉంది. ఫలితంగా ఈ మ్యాచ్‌ విజయం కూడా భారత్ సొంతమైంది.

6 / 6
 దీంతో గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భారత్ జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరుకుంది.