Virat Kohli: కోహ్లీ ఖాతాలో చేరనున్న 3 భారీ రికార్డులు.. ఆ దిగ్గజాల సరసన చోటు

Updated on: Feb 19, 2025 | 8:59 PM

Virat Kohli Records: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫాంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే, నేటి నుంచి మొదలైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో విరాటో కోహ్లీ ఖాతాలో మూడు రికార్డులు చేరే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దిగ్గజాల సరసన చేరేందుకు సిద్ధమయ్యాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
Virat Kohli May Break 3 Records in Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో, భారత అభిమానుల కళ్ళు విరాట్ కోహ్లీపైనే ఎక్కువగా ఉంటాయి. ఇటీవల విరాట్ కోహ్లీ ఫామ్ అంత బాగా లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో, అతను చివరి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొంత ఆశ పెంచాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో అతను ఎలా రాణిస్తాడో చూడాలి.

2 / 5
ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ బ్యాట్ బాగా రాణిస్తే, అతను తన పేరు మీద కొన్ని భారీ రికార్డులు కూడా సృష్టించగలడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ బద్దలు కొట్టగల మూడు భారీ రికార్డుల గురించి ఓసారి తెలుసుకుందాం..

3 / 5
3. వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు: విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 297 వన్డేల్లో భారతదేశం తరపున మొత్తం 13,963 పరుగులు చేశాడు. అతను మరో 37 పరుగులు చేస్తే వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేస్తాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు సృష్టించనున్నాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కర మాత్రమే వన్డేల్లో 14 వేలకు పైగా పరుగులు సాధించారు. టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు.

4 / 5
2. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు: ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించడానికి విరాట్ కోహ్లీకి సువర్ణావకాశం ఉంది. 2009 నుంచి 2017 వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 529 పరుగులు చేశాడు. అతను మరో 263 పరుగులు చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఈ విషయంలో రికార్డు ప్రస్తుతం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2002 నుంచి 2017 వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో గేల్ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో 3 సెంచరీలతో సహా 791 పరుగులు చేశాడు. అయితే, కోహ్లీ అతన్ని అధిగమించే అవకాశం ఉంది.

5 / 5
1. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక హాఫ్ సెంచరీలు: ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా విరాట్ కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున కోహ్లీ ఇప్పటివరకు 5 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను కనీసం రెండు హాఫ్ సెంచరీలు సాధిస్తే, ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు. ద్రవిడ్ 19 మ్యాచ్‌ల్లో 6 అర్ధ సెంచరీలు సాధించాడు.