Venkata Chari |
Dec 29, 2021 | 6:02 AM
టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన ఐదో భారత ఫాస్ట్ బౌలర్‌గా మహమ్మద్ షమీ నిలిచాడు. షమీ తన కెరీర్‌లో 55వ టెస్టులో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
సెంచూరియన్‌లో, మహ్మద్ షమీ 44 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాను మొదటి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే పరిమితం చేశాడు. మార్క్రమ్, పీటర్సన్, బావుమా, ముల్డర్, రబడలను షమీ అవుట్ చేశాడు.
ఈ భారత ఫాస్ట్ బౌలర్ 200 వికెట్ల మార్క్‌ను చేరుకునే వరకు 6 సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఇంతకు ముందు టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన భారత బౌలర్లలో కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు ఉన్నారు.
ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు సహా మొత్తం 11 మంది భారత బౌలర్లు ఇప్పటి వరకు 200 వికెట్లు తీశారు.
200 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి కపిల్ దేవ్ 50 టెస్టులు ఆడగా, జవగల్ శ్రీనాథ్ 54 టెస్టుల్లో 200 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో కనీసం 37 టెస్టు మ్యాచ్‌ల్లో 200 వికెట్లు తీసిన రికార్డు ఆర్ అశ్విన్ పేరిట ఉంది.