ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత క్రికెటర్లు కూడా ఈ వేడుకలో మునిగిపోయారు. తమ కుటుంబాలు, స్నేహితులు, సన్నిహితులతో గ్రాండ్‌గా న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ పలికారు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉన్నాడు. కోహ్లి తన భార్య, నటి అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి దుబాయ్‌లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
విరాట్ కోహ్లీతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. క్రిస్మస్ వేడుకలను కూడా ఇక్కడే జరుపుకున్న ధోనీ.. న్యూ ఇయర్‌ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే, టీమిండియా బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా కూడా తన కుటుంబంతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్లాడు. తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కూడా తన కుటుంబంతో కలిసి కశ్మీర్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంది.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నాడు. తన భార్య, కుమారుడు కొడుకు ఓరియన్ కీస్‌తో కలిసి విదేశాలలో తన కొత్త సంవత్సరాన్ని జరుపుకొన్నాడు.