
టీమిండియా ఆటగాడు, కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. గురువారం తన చిరకాల స్నేహితురాలు రచనా కృష్ణతో కలిసి సంప్రదాయ పంథాలో ఏడడుగులు వేశాడు.

మంగళవారం పసుపు వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నేడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

ఈ సాధారణ వేడుకలో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ప్రసిద్ధ్ కృష్ణ చిన్ననాటి భాగస్వామి రచనా కృష్ణ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన రచన అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

2021లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటి వరకు 14 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో 5.32 సగటుతో పరుగులు ఇచ్చి మొత్తం 25 వికెట్లు పడగొట్టాడు.

అలాగే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన బౌలర్‌గా పేరుగాంచాడు. ఈ సీజన్‌లో గాయం కారణంగా ఆడలేదు. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 51 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక స్పీడ్‌స్టర్ 49 వికెట్లు పడగొట్టాడు.