టీమ్‌ఇండియాకు నమ్మకం లేని బ్యాట్స్‌మెన్, విరాట్ కోహ్లీ-రవిశాస్త్రి ఓపెనర్‌గా వద్దని అన్నారో, ఇప్పుడు అదే ఆటగాడు దక్షిణాఫ్రికాలో తన బ్యాట్‌తో అందరికి మరోసారి తనేంటో చూపించాడు. దక్షిణాఫ్రికా-ఏపై అద్భుత సెంచరీ చేసిన అభిమన్యు ఈశ్వరన్ తిరుగులేని ఫాంను కొనసాగించాడు.
బ్లూమ్‌ఫోంటెయిన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో అభిమన్యు ఈశ్వరన్ 209 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. ఈశ్వరన్ తన సెంచరీలో 16 ఫోర్లు కొట్టాడు. అలాగే కెప్టెన్ ప్రియాంక్ పంచల్‌తో కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.
అభిమన్యు ఈశ్వరన్ ఈ సెంచరీ ఇన్నింగ్స్ అతని విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చినట్లైంది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఈశ్వరన్‌ను టీమ్ ఇండియాలో చేర్చారు. ఇంగ్లండ్‌లో శుభ్‌మన్ గిల్ గాయపడిన తర్వాత, అభిమన్యు ఈశ్వరన్ జట్టుతో ఉన్నప్పుడు కూడా విరాట్, రవిశాస్త్రి కొత్త ఓపెనర్‌ను కోరుకున్నారు. ఈ విషయమై సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
భారత్ ఏ తరఫున కెప్టెన్ ప్రియాంక్ పంచల్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పాంచల్ 96 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. పాంచల్ తన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు కొట్టాడు.
ఈ మ్యాచులో హనుమ విహారి ఫ్లాప్ అయ్యాడు. పిచ్‌పై స్థిరపడిన తర్వాత తన వికెట్ కోల్పోయాడు. ఈ రైట్ హ్యాండ్ టెస్ట్ స్పెషలిస్ట్ 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు.