T20 World Cup 2024: ప్రపంచ రికార్డ్ లిఖించిన బాబర్ ఫ్రెండ్.. ఆ స్పెషల్ లిస్టులో ఎవరున్నారంటే?

|

Jun 12, 2024 | 1:46 PM

T20 World Cup 2024: న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో కెనడాతో జరిగిన మ్యాచ్ ద్వారా పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీయడం కూడా ప్రత్యేకం.

1 / 5

2 / 5
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఈ సమయంలో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హారిస్ రవూఫ్ 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లతో హారిస్ రవూఫ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

3 / 5
దీనితో పాటు, T20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో వంద వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్‌గా హారిస్ రవూఫ్ ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. గతంలో ఈ రికార్డు బిలాల్ ఖాన్ పేరిట ఉండేది.

4 / 5
ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ టీ20 క్రికెట్‌లో కేవలం 71 ఇన్నింగ్స్‌ల్లోనే 100 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ రికార్డును హారిస్ రవూఫ్ బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించడం విశేషం.

5 / 5
పాకిస్థానీ స్పీడ్‌స్టర్ 69 ఇన్నింగ్స్‌ల ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌గా హారిస్ రవూఫ్ నిలిచాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు సృష్టించాడు. అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 53 మ్యాచ్‌ల ద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో హారిస్ రవూఫ్ అగ్రస్థానంలో నిలిచాడు.