T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే! లిస్టులో కోహ్లీ, యువీవి కూడా!

|

May 18, 2024 | 6:20 PM

T20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ టీ20 ప్రపంచకప్‌లో మరి కొన్ని రికార్డులు బద్దలు కానున్నాయి. అయితే కొన్ని రికార్డులు బద్దలు కొట్టడం మాత్రం అంత తేలికేమీ కాదు. అలాంటి బద్దలు కొట్టలేని రికార్డులు ఏమిటో తెలుసుకుందాం…

1 / 6

2 / 6
అత్యధిక సిక్సర్లు: టీ20 క్రికెట్‌ అంటేనే సిక్సర్ల వర్షం. అయితే టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఇప్పటివరకు మొత్తం 63 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 2వ ర్యాంక్ బ్యాటర్.  హిట్ మ్యాన్ ఇప్పటివరకు 35 సిక్సర్లు కొట్టాడు. అయితే గేల్ రికార్డును బద్దలు కొట్టడం కష్టమే అని చెప్పొచ్చు.

3 / 6
 భారీ విజయం: 2007 T20 ప్రపంచకప్‌లో కెన్యాపై శ్రీలంక 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 260 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు. కాబట్టి ఈ రికార్డును బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు.

4 / 6
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ: టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్  యువరాజ్ సింగ్ T20 ప్రపంచ కప్‌లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2007 ప్రపంచకప్‌లో నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటి వరకు చెరిగిపోలేదు. అలాగే టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా యువీ పేరిటే ఉంది. కాబట్టి ఈ రికార్డులను బద్దలు కొట్టడం కూడా కష్టమే అని చెప్పొచ్చు.

5 / 6
అత్యధిక పరుగులు: T20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగుల సగటు కలిగిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు కింగ్ కోహ్లీ 27 మ్యాచ్‌లు ఆడి 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. అతను 14 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు.

6 / 6
బిగ్ చేజ్: T20 వరల్డ్ కప్ 2016 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి ఈ భారీ స్కోరును  ఛేదించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఇంతటి భారీ ఛేజింగ్‌ టీ20 ప్రపంచకప్‌లో కనిపించకపోవడం ఆశ్చర్యకరం. కాబట్టి ఈ రికార్డును బద్దలు కొట్టడం అనుకున్నంత ఈజీ కాదు.