టీ20 ప్రపంచకప్ 2021లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈసారి టైటిల్ గెలవడానికి టీమిండియా బలమైన పోటీదారుగా నిలిచింది. పరుగుల యంత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ టీంను నడిపించనున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్‌తో భారత్ చాలా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రాణిస్తున్నారు. ఈసారి భారత్ తరపున ఎక్కువమంది యువకులు కనిపిస్తున్నారు. అయితే వీరంతా కనీసం ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అయినా ఆడినవారే కావడం విశేషం. కానీ, టీ20 ప్రపంచ కప్‌తో తమ అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను ప్రారంభించిన భారతీయ తారలు ఎందరో ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.