T10 League: 6,6,6,6,6,4,4,4.. క్రిస్‌గేల్‌ తుఫాన్ ఇన్నింగ్స్‌‌.. ఏ బౌలర్‌ను విడిచిపెట్టలే..!

|

Nov 27, 2021 | 8:19 AM

T10 League 2021-22, Bangla Tigers vs Team Abu Dhabi: అబుదాబి జట్టు తరపున క్రిస్ గేల్ 23 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

1 / 4
ది యూనివర్స్ బాస్‌గా ప్రసిద్ధి చెందిన క్రిస్ గేల్ IPL 2021లో ప్రత్యేకంగా ఎలాంటి మాయ చేయలేకపోయాడు. టీ20 ప్రపంచకప్‌లో అతని బ్యాట్‌ సంచలన ఇన్నింగ్స్‌లు నెలకొల్పకపోయినా, ఈ ఆటగాడు మాత్రం ఇంకా వేగంగా పరుగులు సాధించే సత్తా కలిగి ఉన్నాడు.

2 / 4
టీ10 లీగ్‌లోని 17వ మ్యాచ్‌లో క్రిస్ గేల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అబుదాబి జట్టు తరఫున ఆడుతున్న గేల్ బంగ్లా టైగర్స్‌పై హాఫ్ సెంచరీ బాదేశాడు. గేల్ 23 బంతుల్లో అజేయంగా 53 పరుగులతో బౌలర్లపై విరుచపడ్డాడు.

3 / 4
గేల్ సిక్సర్లు, ఫోర్లతో 42 పరుగులు చేశాడు. గేల్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. అయితే ఇంతలా గేల్ చెలరేగి ఆడినా.. తన జట్టు మాత్రం గెలవలేకపోవడం విశేషం.

4 / 4
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన టీం అబుదాబి జట్టు కేవలం 120 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. నాటౌట్‌గా నిలిచినా.. గేల్ మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. అబుదాబి కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ 6 బంతుల్లో 20 పరుగులు, ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 17 పరుగులు చేసినా జట్టు ఓటమిని తప్పించలేకపోయారు. బంగ్లా టైగర్స్ తరఫున విల్ జాక్వెస్ 17 బంతుల్లో 43 పరుగులు, హజ్రతుల్లా జజాయ్ 20 బంతుల్లో 41 పరుగులు చేశారు.