IND vs WI: కోహ్లీ లిస్టులోకి సూర్య ఎంట్రీ.. కేఎల్ రాహుల్‌ని అధిగమించి ప్రత్యేక రికార్డ్.. వివరాలివే..

|

Aug 14, 2023 | 12:11 PM

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో కరేబియన్ల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ 3-2 తేడాతో కరేబియన్ల జట్టు ఖాతాలో పడింది. అయితే ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో 61 రన్స్ చేసిన సూర్య కుమార్ యాదవ్‌ అరుదైన రికార్డ్‌ని నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను తన కంటే సీనియర్ అయిన కేఎల్ రాహుల్‌ని కూడా బ్రేక్ చేయడం విశేషం. ఇంతకీ సూర్య సాధించిన ఆ ఘనత ఏమిటంటే..

1 / 5
వెస్టిండీస్‌తో జరిగిన 5 టీ20 ద్వారా సూర్య కుమార్ యాదవ్ తన కెరీర్‌లో 50వ టీ20 ఇన్నింగ్స్‌ని పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మైలురాయి మ్యాచ్‌లో 61 పరుగులతో హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఇలా తన 50 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య మొత్తం 1841 పరుగులు చేశాడు.

2 / 5
కేఎల్ రాహుల్  తన తొలి 50 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 1751 పరుగులే చేశాడు. దీంతో 50 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ కంటే అధిక పరుగులు చేసిన సూర్య.. మొత్తంగా 4వ స్థానంలో ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్ 5వ స్థానానికి దిగాడు.

3 / 5
అయితే తొలి 50 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తన 50 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 1943 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

4 / 5
తొలి 50 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 1942 పరుగులు చేసిన బాబర్ అజామ్ ఈ లిస్టు రెండో స్థానంలో ఉన్నాడు.

5 / 5
ఇక మూడో స్థానంలో మొహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ తన తొలి 50 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 1888 పరుగులు చేశాడు.