
మిథాలీ- శార్దూల్‌లు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదం కూడా లభించడంతో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.

ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఓ వేదికపై శార్దూల్ ఠాకూర్- మిథాలీల ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది.

టీమిండియా టీ -20 కెప్టెన్ రోహిత్ శర్మ ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు.

సహచర క్రికెటర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, విజయ్ శంకర్, వసీం జాఫర్ తదితర క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు విషెస్ తెలిపారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచకప్ ముగిసిన తర్వాతే వీరు ఏడడుగులు నడవనున్నారని సమాచారం.