- Telugu News Photo Gallery Cricket photos Salonee Dangore Joined Trinbago Knight Riders for the Womens Caribbean Premier League 2025
టీమిండియా తరపున ఎన్నడూ ఆడలే.. కట్‌చేస్తే.. షారుక్ టీంలో బంఫర్ ఆఫర్ పట్టేసిన బ్యూటీఫుల్ ప్లేయర్
Salonee Dangore: భారత యువ క్రికెటర్ సలోని డంగోర్‌కు అద్భుతమైన అవకాశం లభించింది. ఆమె 2025 ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడేందుకు సిద్ధమైంది. సలోని డంగోర్ ఇంకా ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోవడం గమనార్హం.
Updated on: Jul 01, 2025 | 1:56 PM

Salonee Dangore: సలోని డంగోర్ పేరు భారత క్రికెట్‌లో కొత్తదే కావొచ్చు. కానీ, ఈ క్రీడాకారిణికి క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి భారీ అవకాశం లభించింది. సలోని డంగోర్ త్వరలో విదేశీ క్రికెట్ లీగ్‌లో ఆడనుంది. ప్రత్యేకత ఏమిటంటే సలోని డంగోర్ ఇంకా ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇది మాత్రమే కాదు, ఆమె ఎప్పుడూ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో పాల్గొనలేదు. ఇటువంటి పరిస్థితిలో, ఈ క్రీడాకారిణిని విదేశీ లీగ్‌లో ఎంపిక చేయడం చాలా ఆశ్చర్యకరం.

27 ఏళ్ల లెగ్-స్పిన్ ఆల్ రౌండర్ సలోని డాంగోర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో చోటు దక్కించుకోకుండానే 2025 ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (WCPL)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR)తో ఒప్పందం కుదుర్చుకుంది. విదేశీ T20 లీగ్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎంపిక కావడం చాలా అరుదు. కాబట్టి, ఈ విజయం ప్రత్యేకమైనది. సలోని ఇండోర్‌లో జన్మించింది. అక్కడ ఆమె తన ప్రారంభ సంవత్సరాలను అథ్లెటిక్స్‌కు అంకితం చేసింది. 100 మీ, 200 మీ రేసు, లాంగ్ జంప్‌లలో జాతీయ స్థాయిలో పోటీపడిన సలోనికి క్రికెట్‌పై ఆసక్తి లేదు.

ఆమె క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఆమెకు దాదాపు 17 సంవత్సరాలు. గత రెండు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్లలో, డాంగోర్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో నెట్ బౌలర్‌గా ఉండేది. ఇప్పుడు ఆమె లిజెల్ లీ, శిఖా పాండే, జెస్ జోనాసెన్‌లతో పాటు TKRలోని నలుగురు విదేశీ ఆటగాళ్ళలో ఒకరిగా బరిలోకి దిగనుంది. సలోని ఆస్ట్రేలియన్ లెజెండ్ షేన్ వార్న్‌ను తన ఆదర్శంగా భావిస్తుంది. షేన్ వార్న్ స్లో మోషన్‌లో బౌలింగ్ చేసే వీడియోలను చూడటం ద్వారా ఆ టెక్నిక్‌ను నేర్చుకుంది.

సలోని డాంగోర్ ESPNcricinfoతో మాట్లాడుతూ, 'నేను షేన్ వార్న్ బంతిని తిప్పే విధానం నుంచి ప్రేరణ పొందాను. కానీ, నా చేయి వేరే దిశలో కదిలేది. నా బౌలింగ్‌లో ఎక్కువ భాగం గూగ్లీలుగా మారాయి. దీంతో షేన్ వార్న ఎలా బౌలింగ్ చేస్తాడో అర్థం చేసుకోవడానికి నేను అతని వీడియోలను స్లో మోషన్‌లో చూసేదానిని' అంటూ చెప్పుకొచ్చింది.

2017-18లో, సలోని దంగోర్ మధ్యప్రదేశ్ తరపున తన దేశీయ క్రికెట్ అరంగేట్రం చేసింది. అయితే, ప్రారంభ సంవత్సరాల్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. మెరుగైన అవకాశాల కోసం, ఆమె 2024-25 సీజన్‌కు ముందు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లింది. ఈ నిర్ణయం ఆమె కెరీర్‌కు కొత్త దిశానిర్దేశం చేసింది. ఛత్తీస్‌గఢ్ తరపున ఆడిన వన్డే టోర్నమెంట్‌లో, ఆమె 6 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి 144 పరుగులు చేసింది. ఇప్పుడు ఆమె కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటానికి సిద్ధంగా ఉంది.




