- Telugu News Photo Gallery Cricket photos Asia cup 2025 starts september 5 in uae india vs pakistan likely on september 7th tournament check unofficial schedule
Asia Cup 2025: ఆసియా కప్ షెడ్యూల్ ఫిక్స్.. యూఏఈలో భారత్, పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
India vs Pakistan: ఆసియా కప్ టోర్నమెంట్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 10 నుంచి నిర్వహిస్తుందని నివేదికలు వస్తున్నాయి. ఆసియా కప్ 2025 షెడ్యూల్ ఇంకా వెల్లడి కాలేదు. కానీ టోర్నమెంట్ షెడ్యూల్ జులై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Updated on: Jul 02, 2025 | 8:27 AM

ఆసియా కప్ 2025 షెడ్యూల్‌పై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక టోర్నీ సెప్టెంబర్ 5న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ప్రారంభం కానుంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య హై-వొల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 7న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొద్దికాలంగా భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కారణంగా దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్‌లపై సందిగ్ధత నెలకొంది. అయితే, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తోంది. నివేదికల ప్రకారం, టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన తుది నిర్ణయం, పూర్తి షెడ్యూల్‌ను జులై మొదటి వారంలో ఏసీసీ ప్రకటించే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఆసియా కప్‌నకు భారత్ అధికారిక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యూఏఈని తటస్థ వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. ఇదివరకు కూడా భారత్ లేదా పాకిస్తాన్ ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భాల్లో, ఇరు జట్ల మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరిగాయి.

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ సహా మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్, సూపర్ ఫోర్స్ ఫార్మాట్‌లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల అభిమానులకు కనీసం రెండుసార్లు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను చూసే అవకాశం లభిస్తుంది. రెండోసారి సెప్టెంబర్ 14న ఇరు జట్లు తలపడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. దీనితో ఆసియా కప్ నిర్వహణపై సందేహాలు తలెత్తాయి. అయితే, ఇటీవల ఐసీసీ విడుదల చేసిన మహిళల వన్డే, టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను చేర్చడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు అంతర్జాతీయ టోర్నీల్లో కొనసాగుతాయనడానికి సంకేతం. మొత్తంమీద, క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్ 2025 షెడ్యూల్ అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.




