Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో ‘హిట్‌మ్యాన్’ హవా.. 2013 నుంచి తగ్గేదేలే అంటోన్న భారత సారథి..

|

Jul 19, 2023 | 1:43 PM

Team India Captain Rohit Sharma: రోహిత్ శర్మ 2013 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా కమాండ్‌ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

1 / 5
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. భారత కెప్టెన్ ఇన్నింగ్స్ 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. అయితే, ఎవరూ గుర్తించని రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇందులో రోహిత్ చుట్టూ ఏ బ్యాట్స్‌మెన్ కూడా లేడు. 2013 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.

2 / 5
అద్భుతమైన హిట్టింగ్‌తో 'హిట్‌మ్యాన్'గా పేరుగాంచిన రోహిత్ శర్మ 2013 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో 486 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా దగ్గరగా లేరు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో బట్లర్ 297 సిక్సర్లు కొట్టాడు.

3 / 5
మరోవైపు న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ 282 సిక్సర్లు, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 264, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 253 సిక్సర్లు బాదారు.

4 / 5
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 442 మ్యాచ్‌ల్లో 529 సిక్సర్లు అతని బ్యాట్ నుంచి వచ్చాయి.

5 / 5
ఈ జాబితాలో క్రిస్ గేల్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. గేల్ 483 మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో మూడో స్థానంలో, బ్రెండన్ మెకల్లమ్ 398 సిక్సర్లతో నాలుగో స్థానంలో, మార్టిన్ గప్టిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.