
శ్రీలంకతో వన్డే సిరీస్ టీమిండియా ఖాతాలో పడింది. లంకను ఓడించడం అంటే వన్డే ప్రపంచానికి భారత్ సన్నాహాలు సరైన దిశలో ఉన్నాయని అర్థం. కానీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది చిన్న విజయం మాత్రమే. ఇది ఇలాగే కొనసాగితే, రోహిత్ ఖాతాలో భారీ జాక్‌పాట్ చేరనుంది.

ఇక్కడ జాక్‌పాట్ అంటే అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను గెలవడం అన్నమాట. 2013 సంవత్సరం నుంచి ఐసీసీ ట్రోఫీని గెలవాలని భారత్ ఎదురుచూస్తూనే ఉంది. కానీ, ఈ నిరీక్షణ ఈసారి ఆగిపోవచ్చు. ఎందుకంటే 3 యాదృచ్ఛికాలు భారతదేశం తరపున నిలిచాయి.

అవేంటో ఇప్పుడు చూద్దాం.. గత మూడు వన్డే ప్రపంచ కప్‌లకు, వాటిని గెలుచుకున్న జట్లకు మధ్య ఉన్న సంబంధం. 2019 వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్‌లో జరిగింది. అక్కడ ప్రపంచ ఛాంపియన్ కూడా ఆతిథ్య ఇంగ్లాండ్ కావడం గమనార్హం.

అదేవిధంగా, 2015 సంవత్సరంలో, ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ ప్రపంచకప్‌ను కూడా కంగారూల గడ్డపై ఆడిన సంగతి తెలిసిందే.

అంతకు ముందు 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు గత మూడు ప్రపంచకప్‌ల్లో ఆతిథ్య దేశం ట్రోఫీని కైవసం చేసుకున్న ట్రెండ్ అలానే కొనసాగితే.. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాక్‌పాట్ రోహిత్ చేతుల్లోకి వస్తుందని స్పష్టమవుతోంది. దీంతో పాటు కపిల్ దేవ్, ధోనీ లాంటి కెప్టెన్‌గా కూడా పేరు తెచ్చుకుంటాడు.