Venkata Chari |
Oct 30, 2022 | 5:36 PM
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022లో భారత్ శుభారంభం చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఈ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన వెంటనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌కి ఇది 36వ మ్యాచ్. కాగా, ఈ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా టీమిండియా సారథి నిలిచాడు.
ఈ విషయంలో టీమిండియా సారథి.. శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్‌ను వెనక్కి నెట్టాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ టీ20 ప్రపంచకప్‌లో 35 మ్యాచ్‌లు ఆడాడు. గత మ్యాచ్‌లో దిల్షాన్‌ను సమం చేసిన రోహిత్.. నేడు అతడిని వెనక్కునెట్టాడు.
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్, దిల్షాన్ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో, పాక్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌లో ముగ్గురూ తలో 34 మ్యాచ్‌లు ఆడారు.
భారత మాజీ కెప్టెన్, తొలి టీ20 ప్రపంచకప్ విజేత మహేంద్ర సింగ్ ధోనీ, వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్ఫికర్ రహీమ్ 33 మ్యాచ్‌లు ఆడారు. మహేల జయవర్ధనే, లసిత్ మలింగ 31 మ్యాచ్‌లు ఆడారు.