- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma And Cummins Photoshoot in Adalaj Stepwell Monument With icc world cup 2023 Trophy Ahead Of cwc Final
IND vs AUS: ట్రోఫీతో ఫోజులిచ్చిన రోహిత్-కమిన్స్.. ఆ స్మారక చిహ్నం స్పెషాలిటీ ఏంటో తెలుసా?
India vs Australia Word Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ చివరి మ్యాచ్ ఆదివారం, నవంబర్ 19న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా ఉంచేందుకు ఐసీసీ, బీసీసీఐ పక్కా ప్లాన్‌తో ముగింపు వేడుకలు సిద్ధం చేస్తున్నాయి. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
Updated on: Nov 18, 2023 | 5:31 PM

వన్డే ప్రపంచకప్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

అంతకుముందు శనివారం, రెండు జట్ల కెప్టెన్లు ప్రపంచ కప్ ట్రోఫీతో ఫొటోషూట్‌తో సందడి చేశారు. ఐసీసీ టోర్నీలో భాగంగా జరుగుతున్న ఈ ఫొటో షూట్ లో పలు రకాలుగా పోజులివ్వడం విశేషం.

అహ్మదాబాద్‌లోని అదాలాజ్ స్టెప్‌వెల్ మెమోరియల్‌లో జరిగిన ఫొటోషూట్ ఫొటోలను ICC సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది. డిఫరెంట్ మూడ్‌లో వచ్చిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఈ ఫొటోషూట్ నిర్వహించిన అదాలాజ్ స్టెప్‌వెల్ మాన్యుమెంట్ 1498లో నిర్మించారు. ఇది గుజరాత్‌లోని అత్యుత్తమ నిర్మాణ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచింది. ఈ స్మారక చిహ్నం 5 అంతస్తుల నిర్మాణంలో ప్రత్యేకంగా ఉంటుంది. అహ్మదాబాద్ నగర శివార్లలో ఉన్న అదాలజ్ స్టెప్‌వెల్ గుజరాత్ గొప్ప సంస్కృతికి చిహ్నంగా, ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది.

వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం, నవంబర్ 19న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.




