
Most Expensive IPL Cricketers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కేవలం ఆట మాత్రమే కాదు, క్రికెటర్లకు భారీగా జీతాలిచ్చే వేదిక. 2026 సీజన్ వరకు ఆటగాళ్లు అందుకున్న జీతాల (Salaries) ఆధారంగా అత్యధిక ఆదాయం పొందిన క్రికెటర్ల జాబితాను ఓసారి చూద్దాం. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాళ్లు, వారి ఆదాయ వివరాలు ఎలా ఉన్నాయంటే..

1. రోహిత్ శర్మ: రూ. 210.9 కోట్లు: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ (MI) ఐదుసార్లు టైటిల్ గెలిచిన మాజీ సారథి రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. లీగ్‌లో ఆయన సుదీర్ఘ కాలం, నాయకత్వం, స్థిరమైన ప్రదర్శనతో ఇలాంటి భారీ జీతాన్ని అందుకున్నాడు.

2. విరాట్ కోహ్లి: రూ. 209.2 కోట్లు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి స్వల్ప తేడాతో రెండవ స్థానంలో ఉన్నాడు. లీగ్‌లో ఒకే ఫ్రాంచైజీకి అత్యంత ఎక్కువ కాలం ఆడిన ఆటగాళ్లలో ఆయన ఒకడిగా నిలిచాడు.

3. ఎం.ఎస్. ధోని: రూ. 192.84 కోట్లు: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కి ఐదు IPL టైటిల్స్‌ను అందించిన 'కెప్టెన్ కూల్' ఎం.ఎస్. ధోని మూడవ స్థానంలో నిలిచాడు. అతని అపారమైన అనుభవం, నాయకత్వ సామర్థ్యం, ఆటపై ప్రభావం ఆయన వేతనాన్ని భారీగా పెంచేలా చేశాయి.

4. రవీంద్ర జడేజా: రూ. 139.01 కోట్లు: చెన్నై సూపర్ కింగ్స్ (CSK), భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగవ స్థానంలో నిలిచాడు. ఆయన ఆల్‌రౌండ్ నైపుణ్యాలు - బౌలింగ్, బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ - జట్టుకు ఆయన విలువను పెంచాయి.

5. సునీల్ నరైన్: రూ. 125.25 కోట్లు: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు. విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ఆదాయం పొందినవారిలో ఆయన ఒకరు కావడం విశేషం.