IND vs SL: సచిన్-కపిల్ లిస్టు అగ్రస్థానంలోకి జడేజా.. ఏళ్ల నాటి ఇర్ఫాన్ రికార్డ్‌కు బ్రేక్..

|

Sep 13, 2023 | 7:51 AM

IND vs SL: కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఆసియా కప్ సూపర్ 4 క్లాష్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ 53 పరుగులు, బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ విజయడం ద్వారా భారత్ ఆసియా కప్ 2023 ఫైనల్స్‌కి చేరింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా ఓ అరుదైన ఘనత సాధించడంతో పాటు ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉన్న ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేశాడు.

1 / 5
ఆసియా కప్ సూపర్ 4 క్లాష్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉన్న 2012 నాటి రికార్డును జడేజా బ్రేక్ చేశాడు.

2 / 5
ఈ మ్యాచ్‌లో ధనంజయ డి సిల్వా, దసున్ షనక వికెట్లను తీసిన జడేజా.. ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అవతరించాడు. అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఈ స్థానంలో ఇర్ఫాన్ పఠాన్ ఉండేవాడు.

3 / 5
2004, 2008, 2012 ఆసియా కప్ టోర్నీలో భారత్ తరఫున 12 మ్యాచ్‌లు ఆడిన ఇర్ఫాన్ మొత్తం 22 వికెట్లు తీశాడు. మరోవైపు ఆసియా కప్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన జడేజా 24 వికెట్లు పడగొట్టాడు.

4 / 5
తద్వారా ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇర్ఫాన్ స్థానాన్ని జడేజా తన సొంతం చేసుకున్నాడు. అలాగే ఇర్ఫాన్ ఇప్పుడు రెండో స్థానంలోకి దిగాడు.

5 / 5
కాగా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 లిస్టులో కుల్దీప్ (19), సచిన్ టెండూల్కర్ (17), కపిల్ దేవ్ (15) వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నారు.