
యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా చివరిసారిగా జులై 2021లో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి నుంచి టీమింయాలోకి ప్రవేశించలేదు. ఐపీఎల్ నుంచి దేశవాళీ క్రికెట్ వరకు నిరంతరాయంగా పరుగుల వర్షం కురుస్తున్నప్పటికీ పిలుపు రావడం లేదు. వీటన్నింటి మధ్య, షా మరో ట్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా తన డిమాండ్‌ను వినిపిస్తున్నాడు. బ్యాట్‌తో సెలెక్టర్లకు మెసేజ్ ఇచ్చిన షా.. ఇప్పుడు విమర్శకులకు కూడా బదులిచ్చాడు.

గువాహటిలో బుధవారం, జనవరి 11న రంజీ ట్రోఫీలో అస్సాంపై పృథ్వీ షా కేవలం 383 బంతుల్లో 379 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది రికార్డ్ బద్దలు కొట్టే ఇన్నింగ్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది షా అభిమానులకు జట్టులో స్థానం కోసం డిమాండ్‌ను తీవ్రతరం చేయడానికి మళ్లీ అవకాశం ఇచ్చింది.

మరోవైపు, ఈ ఇన్నింగ్స్ తర్వాత, షా చాలాసార్లు ప్రతిదీ సరిగ్గా చేసినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశకు గురయ్యాడు. షా పీటీఐతో మాట్లాడుతూ.." ఇలాంటి ప్రదర్శనలు ఎన్ని ఇచ్చినా కొన్నిసార్లు నిరాశకు గురవుతుంటాం. మన పనిని సరిగ్గా చేస్తున్నామని తెలిసినా.. అందుకు ఫలితం రాదు. నిజాయితీగా ఉంటూ, మైదానంలో, వెలుపల కెరీర్‌తో క్రమశిక్షణతో దూసుకపోతూనే ఉండాలి" అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది మాత్రమే కాదు, అతను తన ప్రవర్తన, అతని పద్ధతులను ప్రశ్నిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. షా మాట్లాడుతూ, “కానీ కొన్నిసార్లు ప్రజలు భిన్నంగా మాట్లాడతారు. తెలియని వ్యక్తులు మనపై తీర్పులు ఇచ్చేస్తుంటారు" అంటూ చెప్పుకొచ్చాడు.

23 ఏళ్ల ముంబై బ్యాట్స్‌మెన్ మాట్లాడుతూ, “నేను బాగా లేనప్పుడు, నాతో లేని వ్యక్తుల గురించి నేను నిజంగా పట్టించుకోను. నేను వాటిని విస్మరించడానికే ఇష్టపడతాను. ఇదే అత్యుత్తమ పాలసీ" అంటూ విమర్శలపై కౌంటర్ ఇచ్చాడు.

1948లో బి నింబాల్కర్ ఇన్నింగ్స్ 443 తర్వాత రంజీలో రెండో అత్యధిక స్కోరు సాధించిన షా, టీమిండియాలో స్థానం గురించిన ప్రశ్నపై మాట్లాడుతూ, “నన్ను ఎవరైనా భారత జట్టులోకి పిలుస్తారా లేదా అని నేను ఆలోచించడం లేదు. నేను చేయగలిగిన విషయాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు" అని తెలిపాడు.