T20 Records: వామ్మో ఆజామూ.. ఒకే దెబ్బకు గేల్, కోహ్లీ రికార్డులు బద్దలు.. అవేంటంటే?

|

Feb 21, 2024 | 8:59 PM

Babar Azam: విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో మొత్తం 11994 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 12 వేల పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కేవలం 6 పరుగులు మాత్రమే చేయాలి. వెస్టిండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోని ప్రతి క్రికెట్ లీగ్‌లో ఆడిన క్రిస్ గేల్ ఈ ఫార్మాట్‌లో మొత్తం 14565 పరుగులు చేశాడు. ఇది కాకుండా, అతను T20లో అత్యధికంగా 22 సెంచరీలు, 88 అర్ధ సెంచరీలు చేశాడు.

1 / 7
పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీని కోల్పోయి ఫామ్ లేని బాబర్ ఆజం.. తాజాగా తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరుగుతున్న పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో బాబర్ ఈ రికార్డును లిఖించాడు.

2 / 7
పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో పెషావర్ జల్మీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బాబర్.. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. బాబర్ కంటే ముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది.

3 / 7
ఫిబ్రవరి 21న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, బాబర్ తన రికార్డు ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 బంతుల్లో 72 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీ20 క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

4 / 7
బాబర్ ఇప్పటివరకు 281 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 271 ఇన్నింగ్స్‌లలో 10000 పరుగులు పూర్తి చేశాడు. అయితే ఈ రికార్డును అందుకోవడానికి క్రిస్ గేల్ 285 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది.

5 / 7
ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. బాబర్ నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2021లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన టీ20లో విరాట్ కోహ్లీ 10 వేల పరుగులు చేశాడు. ఇందుకోసం విరాట్ కోహ్లీ 299 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది.

6 / 7
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో మొత్తం 11994 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 12 వేల పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కేవలం 6 పరుగులు మాత్రమే చేయాలి.

7 / 7
వెస్టిండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోని ప్రతి క్రికెట్ లీగ్‌లో ఆడిన క్రిస్ గేల్ ఈ ఫార్మాట్‌లో మొత్తం 14565 పరుగులు చేశాడు. ఇది కాకుండా, అతను T20లో అత్యధికంగా 22 సెంచరీలు, 88 అర్ధ సెంచరీలు చేశాడు.