World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ కోసం ‘హెల్త్ చెకప్’ చేయిస్తున్న ఎన్ఆర్ఐలు.. ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే..!

|

Jul 23, 2023 | 12:20 PM

IND vs PAK, CWC 2023: క్రికెట్ వరల్డ్ కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5వ నుంచి జరగనుంది. ఇక మెగా టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 15న తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల్లోని ఎన్ఆర్ఐలు, క్రికెట్ అభిమానులు హాస్పిటల్ బాట పడుతున్నారు. అసలు వారు హాస్పిటల్‌ వైపు చూడడానికి, భారత్, పాక్ మ్యాచ్‌కి సంబంధం ఏమిటంటే..?

1 / 5
IND vs PAK: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ సహా మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌లోనే అక్టోబర్ 15న జరగనుంది.

2 / 5
ఈ కారణంగా అహ్మదాబాద్‌లోని స్థానిక, సమీప హోటళ్ల ధరలు ఆకాశానికి చేరాయి. సాధారణ రోజుల్లో 7 లేదా 8 వేల రూపాయలు ఉండే లగ్జరీ హోటల్ గదుల ధర ఏకంగా 40 నుంచి 60 వేల వరకు పెరిగింది. అంత ధర పలికినా దాదాపుగా 70 శాతం హోటల్ బుకింగ్స్ అయిపోయాయని పలు హోటళ్లు ఇప్పటికే అంటున్నాయి.

3 / 5
ఇంకా విమాన ధరలు కూడా అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎలా అయినా వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌.. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడాలని విదేశీ క్రికెట్ అభిమానులు, ఎన్ఆర్ఐలు హాస్పిటల్ బెడ్‌లను బుక్ చేసుకుంటున్నారు.

4 / 5
అక్టోబర్ 15న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యలో పలు హోటళ్లు తమ ధరలను పదిరెట్లు పెంచేశాయి. దీంతో హాస్పిటల్‌లో బెడ్‌ని బుక్ చేసుకుని అటు నుంచి మ్యాచ్ చూసేందుకు వెళ్లవచ్చని పలువురు క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్నారు.

5 / 5
ఇందు కోసం చాలా మంది క్రికెట్ అభిమానులు ఫుల్ బాడీ చెకప్ పేరుతో మొత్తం బ్లాక్‌లను బుక్ చేసుకుంటున్నారు. వైద్యుల ప్రకారం హాస్పిటల్ బెడ్‌లు, గదుల కోసం అమెరికా, కెనడా, కెన్యా వంటి అనేక దేశాల నుంచి బుకింగ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న జరిగే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లో అభిమానుల ఉత్సాహం ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..