IPL 2024: హ్యాట్రిక్ పరాజయాలున్నా.. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్ సరికొత్త చరిత్ర..

|

Apr 03, 2024 | 10:35 AM

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 14వ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్రత్యేక మైలురాయిని తాకడం కూడా విశేషం. 2008 నుంచి 2024 వరకు 250 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. అలాగే, 138 మ్యాచ్‌లు గెలిస్తే.. 108 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో 4 మ్యాచ్‌లు ఫలితం లేకుండా పోయాయి. ముంబై ఇండియన్స్ పేరిట కొత్త రికార్డు చేరిన పూర్తి సమాచారం ఇదిగో..

1 / 6
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్-17లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. అది కూడా హ్యాట్రిక్ పరాజయాల మధ్యలోనే ఉండటం విశేషం.

2 / 6
వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లను పూర్తి చేసింది. దీంతో ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిలిచింది.

3 / 6
2008 నుంచి 2024 వరకు 250 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. అలాగే, 138 మ్యాచ్‌లు గెలిస్తే.. 108 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో 4 మ్యాచ్‌లు ఫలితం లేకుండా పోయాయి.

4 / 6
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. RCB ఇప్పటి వరకు 244 మ్యాచ్‌లు ఆడింది. ఈ IPL లో 250 మ్యాచ్‌లు పూర్తి చేయనుంది.

5 / 6
అలాగే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 241 మ్యాచ్‌లు ఆడాయి. అలాగే ఈ ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడితే 250 మ్యాచ్‌లు సాధించిన జట్ల జాబితాలో చేరిపోతాయి.

6 / 6
ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 239 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ ద్వారా 250 మ్యాచ్‌ల రికార్డు జాబితాలో చేరనుంది.