ఈ నెల నుంచి ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా బుమ్రా ఈ ప్రపంచకప్‌లో ఆడడం లేదని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అతని ప్రత్యామ్నాయాన్ని భారత బోర్డు ఇంకా ప్రకటించలేదు. అయితే అతని స్థానంలో ఎవరు జట్టులోకి రానున్నారో ఇప్పుడు చూద్దాం..
టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా స్థానంలో వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ముందంజలో ఉన్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై బౌలర్‌కు కావాల్సిన అన్ని నైపుణ్యాలు షమీలో ఉన్నాయి. అతని బౌలింగ్ లో బౌన్స్ ఉంటుంది. అలాగే స్వింగ్ కూడా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కూడా షమీ ఎంపిక కాలేదు. అతను జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చని భావిస్తున్నారు.
అతని స్థానాన్ని ఆక్రమించగల మరో పేరు దీపక్ చాహర్. షమీతో కలిసి వరల్డ్‌కప్‌కు సిద్ధంగా ఉన్నాడు.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో దీపక్ మంచి ప్రదర్శన చేశాడు. అతను స్వింగ్, బౌన్స్ రెండింటినీ కలిగి ఉన్నాడు. బ్యాట్‌తో కూడా సహకారం అందించగలడు.
బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్.. సిరాజ్‌కి పేస్, బౌన్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతను వన్డేల్లో కూడా అరంగేట్రం చేశాడు. అతను బుమ్రా స్థానాన్ని కూడా భర్తీ చేయగలడు.
బుమ్రా స్థానంలో అవేశ్‌ఖాన్ జట్టులోకి రావొచ్చు. టీ20లో రాణించగల సత్తా తనకు ఉందని అవేశ్ ఐపీఎల్‌లో తన ఆటతో నిరూపించుకున్నాడు. సిరాజ్, అవేశ్ స్టాండ్‌బైలో కూడా లేరు. అయితే టీమ్‌లో మార్పులు చేయడానికి టీమ్ ఇండియాకు అక్టోబర్ 15 వరకు సమయం ఉంది.