IPL 2021: ఐపీఎల్ చరిత్రలో 19 హ్యాట్రిక్‌లు.. లిస్టులో ఈ ముగ్గురు భారత బౌలర్లను చూస్తే ఆశ్చర్యపోతారంతే..!

|

Sep 18, 2021 | 12:40 PM

ఐపీఎల్ 14 సీజన్లలో బౌలర్లు ఇప్పటివరకు 19 హ్యాట్రిక్‌లు సాధించారు. అత్యధిక సార్లు హ్యాట్రిక్ సాధించిన రికార్డు మాత్రం భారత స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రా పేరిట నమోదైంది.

1 / 6
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 13 సీజన్‌లు పూర్తయ్యాయి. 14 వ సీజన్‌లో సగం ప్రయాణం కూడా ముగిసింది. ఇప్పటివరకు అన్ని సీజన్లలో బౌలర్లు మొత్తం 19 హ్యాట్రిక్‌లు సాధించారు. ఈ జాబితాలో ఉన్న ముగ్గురు బౌలర్లను చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ జాబితాలో కొంతమంది ఆటగాళ్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్‌లు సాధించడం విశేషం.

2 / 6
అమిత్ మిశ్రాను ఐపీఎల్‌లో హ్యాట్రిక్ మ్యాన్ అని కూడా అంటారు. దీనికి కారణం అతని పేరు మీద అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన రికార్డు నెలకొని ఉంది. ఢిల్లీకి చెందిన లెగ్ స్పిన్నర్ ఐపీఎల్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. 2008లో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన మిశ్రా.. డెక్కన్ ఛార్జర్స్‌కు చెందిన రవీంద్ర జడేజా, ప్రగ్యాన్ ఓజా, ఆర్‌పీ సింగ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చి తొలి హ్యాట్రిక్ సాధించాడు. దీని తరువాత 2011 లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడుతూ పంజాబ్ కింగ్స్‌కు చెందిన ర్యాన్ మెక్‌లారెన్, మన్ దీప్ సింగ్, ర్యాన్ హారిస్‌లను ఔట్ చేసి రెండవ హ్యాట్రిక్ సాధించాడు. 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగి భువనేశ్వర్ కుమార్, రాహుల్ శర్మ, పూణే వారియర్స్‌కు చెందిన అశోక్ దిండాను ఔట్ చేసి మూడవ హ్యాట్రిక్ సాధించాడు.

3 / 6
ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో 2 హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్‌గా యువరాజ్ సింగ్ నిలిచాడు. 2009లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన యువీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు చెందిన జాక్ కాలిస్, రాబిన్ ఉతప్ప,  మార్క్ బౌచర్‌లను ఔట్ చేసి తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఐపీఎల్ 2009లో యువరాజ్ సింగ్ తన ఐపీఎల్ కెరీర్‌లో హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ పై రెండో హ్యాట్రిక్ సాధించాడు. హర్షల్ గిబ్స్, ఆండ్రూ సైమండ్స్, వేణుగోపాల్ రావులను వరుసగా పెవిలియన్ చేర్చాడు.

4 / 6
2009లో రోహిత్ శర్మ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌పైనే హ్యాట్రిక్ సాధించాడు. మూడవ సీజన్లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన రోహిత్ శర్మ.. 16 వ ఓవర్ చివరి రెండు బంతుల్లో అభిషేక్ నాయర్ (1), హర్భజన్ సింగ్ (0) లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 18 వ ఓవర్ తొలి బంతికి జేపీ డుమిని (52) ను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

5 / 6
2013 లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ పంజాబ్ కింగ్స్‌పై హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నింగ్స్ 15 వ ఓవర్లో అతను డేవిడ్ హస్సీ, అజహర్ మహమూద్,  గుర్కీరత్ సింగ్ వికెట్లు తీశాడు. నరైన్ 4 ఓవర్ల బౌలింగ్‌లో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

6 / 6
2016 లో ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించాడు. గుజరాత్ లయన్స్‌కు చెందిన దినేశ్ కార్తీక్, డ్వేన్ బ్రావో,  రవీంద్ర జడేజాలను వరుస డెలివరీలలో పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 14వ బౌలర్‌గా నిలిచాడు.