Indian Test Team: తొలి మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా దుమ్మురేపిన యశస్వీ.. ఇక ఆ సీనియర్ ప్లేయర్ కథ ముగిసినట్లేనా..?

|

Jul 16, 2023 | 3:26 PM

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ తరఫున ఓపెనర్‌గా దిగిన యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు. అలాగే ఆ మ్యాచ్‌లో భారత్ కూడా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే యశస్వీ సాధించిన సెంచరీ, అతను కనబర్చిన ఆటతీరు కారణంగా ఓ సీనియర్ ప్లేయర్ కెరీర్ ఇప్పుడు ప్రమాదం పడింది. అదేలా అంటే..?

1 / 6
Team India: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ(103), యశస్వీ జైస్వాల్(171) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. ఇంకా రవిచంద్రన్ ఆశ్విన్ 12, రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసుకున్నారు.

2 / 6
మరోవైపు తొలి టెస్టు మ్యాచ్ ఆడిన యశస్వీ మొదటి ఆటలోనే ఫస్ట్ 171 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ఇంతకముందు టీమిండియా ఓపెనర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ టెస్టు కెరీర్‌ ప్రమాదంలో పడినట్లయింది.

3 / 6
కేఎల్ రాహుల్ టీమిండియా టెస్ట్ టీమ్ ఓపెనర్‌గా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో రాహుల్ గాయపడి ఆటకు దూరమైన సంగతి కూడా విదితమే. రాహుల్ ఆటకు దూరంగా ఉంటున్న సమయంలో జైస్వాల్, అతని కంటే ముందు శుభమాన్ గిల్ వంటి యంగ్ అండ్ ఓపెనింగ్ బ్యాటర్లు జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటున్నారు.

4 / 6
అయితే ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే శతకం బాదిన జైస్వాల్.. ఆ స్థానానికి తానే సరిపోతానని సూచించడంతో గిల్ నెం.3 స్థానంలోనే స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో కేఎల్ రాహుల్ విఫలమయిన కారణంగా యశస్వీ టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్‌గా స్థిరపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

5 / 6
ఎందుకంటే రాహుల్‌కి నిలకడ లేకపోవడంతో సెలక్టర్లు అతనిపై నమ్మకం కోల్పోతున్నారు. మరోవైపు యువ బ్యాటర్లు దూసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయింది. అంతే.. ఆ మ్యాచ్‌లో పూర్తిగా పేలవ ప్రదర్శన కనబర్చిన పుజారా వంటి టెస్టు స్పెషలిస్ట్‌పైన కూడా వేటు పడింది.

6 / 6
ఈ నేపథ్యంలో సెలక్టర్లు మళ్లీ రాహుల్‌కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంకా వెస్టిండీస్‌తో భారత్ ఆడబోతున్న రెండు టెస్టు‌లో కూడా యశస్వీ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటే కేఎల్ రాహుల్ అవసరం ఇక టీమిండియాకు ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక రెండు టెస్టు‌లో యశస్వీ విఫలమైనా.. తొలి టెస్ట్ ప్రభావం అతని కెరీర్‌పై ఉంటుంది. అలాగే టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వంటి మాజీ ప్లేయర్ల నుంచి కూడా యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అందుతుంది.