KL Rahul Records in IPL: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. జట్టు తరుపున స్టోయినిస్ అర్ధ సెంచరీతో రాణించగా, కెప్టెన్‌గా ఆడిన రాహుల్ 33 పరుగులు చేశాడు. దీని ద్వారా రాహుల్ లక్నోకు అరుదైన రికార్డు కూడా సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌పై రాహుల్ 31 బంతుల్లో 3 బౌండరీలతో 33 పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్‌జెయింట్స్ తరపున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.