IPL 2023: డేంజరస్ ఫినిషర్ నుంచి బెస్ట్ కెప్టెన్ వరకు.. దిగ్గజాలకు ఊహించని షాకిచ్చిన ఫ్రాంచైజీలు..

|

Nov 15, 2022 | 9:04 PM

ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇందులో చాలా మంది పెద్ద ప్లేయర్లకు భారీ షాక్ తగిలింది.

1 / 6
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. విడుదలైన ఆటగాళ్ల జాబితాలో చాలామంది కీలక ప్లేయర్లు ఉన్నారు. తదుపరి సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

2 / 6
ఇందులో అతిపెద్ద పేరు కేన్ విలియమ్సన్ ది. విలియమ్సన్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఘోరంగా విఫలమయ్యాడు. అతను చాలా కాలం పాటు జట్టుతో ఉన్నాడు. కానీ, ఈసారి అతను ఈ జట్టులో కనిపించడు. గత సీజన్‌లో విలియమ్సన్‌కు ఫ్రాంచైజీ రూ.14 కోట్లు ఇచ్చింది.

3 / 6
ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్‌ను కూడా విడుదల చేసింది. పూరన్‌ను గతేడాది ఈ జట్టు రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసినా ఈ బ్యాట్స్‌మన్ అంచనాలను అందుకోలేకపోయాడు.

4 / 6
చాలా కాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమైన డ్వేన్ బ్రావో ఈ సీజన్‌లో చెన్నై తరపున ఆడడం లేదు. నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన అతడిని విడుదల చేశారు. బ్రావో ఒకప్పుడు జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

5 / 6
వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ కూడా ఈసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడడం లేదు. అతను IPL నుంచి రిటైర్ అయ్యాడు. అతను 2010 నుంచి జట్టులో ఉన్నాడు. ప్రస్తుతం ముంబై జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేయనున్నాడు.

6 / 6
మయాంక్ అగర్వాల్ గతేడాది పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా విజయం సాధించలేకపోయాడు. అతను కూడా ఈ సంవత్సరం ఫ్రాంచైజీ ద్వారా విడుదలయ్యాడు. గత ఏడాది మయాంక్ కోసం ఫ్రాంచైజీ రూ.12 కోట్లు వెచ్చించింది.