Javagal Srinath: ఆటకు వీడ్కోలు పలికి 20 ఏళ్ళు.. అయినా రికార్డులు సృ‌ష్టిస్తూనే ఉన్న శ్రీనాథ్.. భారత్ తరఫున తొలి..

| Edited By: Ravi Kiran

Sep 04, 2023 | 9:54 PM

Javagal Srinath: భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జావగల్ శ్రీనాథ్ అరుదైన రికార్డ్ సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. 1991–2003 మధ్య కాలంలో భారత జాతీయ జట్టులో ఆడిన శ్రీనాథ్ రిటైర్ అయిన 20 సంవత్సరాల తర్వాత కూడా రికార్డులు సృష్టి్ంచడం గమనార్హం. ఇంతకీ శ్రీనాథ్ తన పేరిట లిఖించుకోబోతున్న ఆ రికార్డ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
జావగల్ శ్రీనాథ్ తన క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున 67 టెస్టులు, 229 వన్డేలు ఆడాడు. ఈ క్రమంలో అతను 236 టెస్ట్ వికెట్లు, 315 వన్డే వికెట్లు పడగొట్టాడు. 1991 నుంచి 2003 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టించిన శ్రీనాథ్ ఆ తర్వాత ఆటకు విడ్కోలు పలికాడు. 

2 / 5
అయితే రిటైర్ అయిన 3 సంవత్సరాల తర్వాత అంటే 2006లో శ్రీనాథ్ ఎమిరేట్స్ ICC ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీల సభ్యునిగా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి తన 17 ఏళ్ల రిఫరీ కెరీర్‌లో శ్రీనాథ్ వరల్డ్ కప్ 2007, చాంపియన్స్ ట్రోఫీ (2009, 2013), టీ20 వరల్డ్ కప్ (2012, 2014, 2016, 2021) టోర్నీల్లో మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించాడు. 

3 / 5
ఈ క్రమంలో శ్రీనాథ్ ఇప్పటి వరకు 249 వన్డేలకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించాడు. ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా భారత్, నేపాల్ మధ్య జరగబోయే మ్యాచ్‌కి కూడా రిఫరీగా వ్యవహరించడం ద్వారా శ్రీనాథ్ రిఫరీగా తన 250వ వన్డేని పూర్తి చేసుకోబోతున్నాడు. 

4 / 5
దీంతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 250 లేదా అంతకంటే ఎక్కువ వన్డేలకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన నాలుగో వ్యక్తిగా శ్రీనాథ్ రికార్డ్ సృష్టించనున్నాడు. శ్రీనాథ్ కంటే ముందు ఈ ఘనతను రంజన్ మదుగల్లె, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రోవ్ మాత్రమే ఈ ఘనతను సాధించారు.  అలాగే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మ్యాచ్ రిఫరీగా శ్రీనాథ్ రికార్డ్‌ సృష్టించబోతున్నాడు.

5 / 5
శ్రీనాథ్ నేడు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించబోతున్న 250 వన్డే కాకుండా అతను ఇప్పటి వరకు 65 టెస్టులు, 118 పురుషుల టీ20 మ్యాచ్‌లు, 16 మహిళల టీ20 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించాడు.