IND vs IRE: బూమ్రా ఖాతాలో కోహ్లీ, పంత్‌కి సాధ్యం కాని రికార్డ్.. టీ20 క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన భారత కెప్టెన్‌గా..

|

Aug 19, 2023 | 9:14 PM

IND vs IRE 1st T20I: ఆసియా కప్, వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించడంతో ఐర్లాండ్ సిరీస్‌లో జస్ప్రీత్ బూమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బూమ్రా సారథ్యంలో ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బూమ్రా ఖాతాలో ఓ అరుదైన రికార్డ్ చేరింది. అదేమిటంటే.. 

1 / 6
ఐర్లాండ్‌పై తొలి టీ20 మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో భారత్ సాధించిన విజయం, కెప్టెన్‌గా బూమ్రాకి ఫస్ట్ మ్యాచ్. ఇలా కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం సాధంచిన బూమ్రా భారత్ తరఫున ఆ ఘనత సాధించిన 9వ టీ20 కెప్టెన్‌గా అవతరించాడు. 

2 / 6
నిజానికి బూమ్రా భారత టీ20 జట్టుకు 11వ కెప్టెన్. అంటే భారత్ టీ20 జట్టుకు సారథ్యం వహించిన వారిలో బూమ్రాతో సహా మొత్తం 9 మంది మాత్రమే కెప్టెన్‌గా తమ టీ20 మ్యాచ్‌లో విజయం సాధించారు. 

3 / 6
ఇలా విజయం సాధించినవారి లిస్టులో బూమ్రా 9వ కెప్టెన్ కాగా.. అతని కంటే ముందు విరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సురేష్ రైనా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఉన్నారు.

4 / 6
మరి భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా తమ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరంటే.. 

5 / 6
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌ ఓడిపోయాడు. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

6 / 6
2022లో సౌతాఫ్రికా టూర్ కోసం వెళ్లిన టీమిండియాను రిషభ్ పంత్ నడిపించాడు. అయితే పంత్ కూడా కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయాడు.