IND vs WI: 29 ఏళ్ల నాటి సచిన్ రికార్డ్ బ్రేక్.. ఆ లిస్టులో అగ్రస్థానానికి ఎగబాకిన ఇషాన్..

|

Jul 31, 2023 | 1:05 PM

Ishan Kishan: భారత్ క్రికెట్ జట్టుకు తాను మంచి ఓపెనర్‌ని అని ఇషాన్ కిషన్ నిరూపించుకుంటున్నాడు. ప్రపంచకప్ కోసం వెస్టిండీస్‌తో ప్రయోగాత్మకంగా ఆడుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆడిన రెండు వన్డేల్లోనూ భారత ఓపెనర్‌గా హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో ఇషాన్ టీమిండియా ఓపెనర్‌గా సచిన్‌కి మాత్రమే సొంతమైన 29 ఏళ్ల నాటి రికార్డును కూడా బ్రేక్ చేశాడు. అదేమింటే..?

1 / 5
IND vs WI 2nd ODI: బర్బోడోస్ వేదిక జరిగిన రెండో వన్డేలో భారత్ తరఫున ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతను టీమిండియా ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్‌కి మాత్రమే సొంతమైన రికార్డ్‌ను కూడా బ్రేక్ చేశాడు.

2 / 5
టీమిండియా ఓపెనర్‌గా తొలి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ అగ్రస్థానంలో ఉండేవాడు. ఓపెనర్‌గా సచిన్ తన తొలి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 321(82, 63, 40, 63, 73) పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు.

3 / 5
అయితే వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే‌లో భారత్ తరఫున 5వ సారి ఓపెనర్‌గా ఆడిన ఇషాన్ 55 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే ఇషాన్ 28 పరుగుల వద్ద సచిన్‌ని అధిగమించి.. భారత్ తరఫున తొలి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు(28, 210, 3, 52, 55) చేసిన ఆటగాడిగా అవతరించాడు. సచిన్ 321 పరుగులు చేయగా.. ఇషాన్ 348 పరుగులు చేశాడు.

4 / 5
ఇషాన్, సచిన్ తర్వాత.. భారత్ తరఫున తొలి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే అత్యధిక పరుగులు చేసిన 3వ శుభమాన్ గిల్ నలిచాడు. గిల్ ఓపెనర్‌గా తన తొలి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 320(33, 64, 43, 98*, 82*) పరుగులు చేశాడు.

5 / 5
కాగా, వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆడిన రెండు వన్డేల్లోనూ ఇషాన్ కిషన్ వరుస హఫ్ సెంచరీలతో మెరవడంతో పాటు ధోని పేరిట ఉన్న అరుదైన రికార్డును‌ కూడా సమం చేశాడు. ఇన్నాళ్లూ ధోని మాత్రమే వెస్టిండీస్‌లో కరేబియన్లపై 2 వరుస వన్డే సెంచరీలు చేసిన రికార్డ్‌ను కలిగి ఉండగా.. ఇషాన్ కూడా వరుస హాఫ్ సెంచరీలతో దాన్ని సమం చేశాడు.