IPL 2021: అగ్రస్థానం కోసం చెన్నై, ఢిల్లీ కొట్లాట.. రోహిత్‌సేనకు చావోరేవో.! కోహ్లీ టీం ఖుషీ..

|

Oct 07, 2021 | 10:27 AM

IPL 2021 Updates: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2021 లీగ్ స్టేజి మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా..

1 / 8
ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లతో లీగ్ స్టేజి పూర్తి కానుంది. అగ్రస్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనుండగా.. చివరి ప్లేస్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య కొట్లాట జరుగుతోంది.

2 / 8
ఇదిలా ఉంటే ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. ముంబై, కోల్‌కతా జట్లలో ఎవరు ఫోర్త్ ప్లేస్‌ను భర్తీ ఎవరు చేస్తారన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కోల్‌కతాకు మెరుగైన రన్‌రేట్ ఉండగా.. ముంబైకి రన్‌రేట్ మైనస్‌లో ఉంది.

3 / 8
ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా చేరాలంటే రాజస్థాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ఖచ్చితంగా నెగ్గాలి. అటు ముంబై చేరాలంటే.. ఖచ్చితంగా హైదరాబాద్ మ్యాచ్‌లో గెలవాలి. రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి.

4 / 8
10 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 9 విజయాలతో 18 పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు 16 పాయింట్స్, కోల్‌కతా 12 పాయింట్స్‌తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

5 / 8
నేటి మ్యాచ్‌లు: చెన్నై సూపర్ కింగ్స్ వెర్సస్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వెర్సస్ రాజస్థాన్ రాయల్స్

6 / 8
ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. అందులో రెండు.. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ల నుంచి రావడం గమనార్హం. సంజూ శాంసన్(119), జోస్ బట్లర్(124), దేవ్‌దూత్ పడిక్కల్(101) ఈ జాబితాలో ఉన్నారు.

7 / 8
ఆరెంజ్ క్యాప్: కెఎల్ రాహుల్(528) అగ్రస్థానంలో.. రుతురాజ్ గైక్వాడ్(521) రెండో స్థానంలో.. శిఖర్ ధావన్(501), సంజూ శాంసన్(483), డుప్లెసిస్(470)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

8 / 8
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్(29 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆవేశ్ ఖాన్(22 వికెట్లు) రెండు, జస్ప్రిత్ బుమ్రా(19 వికెట్లు), షమీ(18 వికెట్లు), రషీద్ ఖాన్(16 వికెట్లు)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.