IPL 2021: రోహిత్‌కు ఏమైంది.? దిగజారిన ముంబై.. టాప్ ప్లేస్‌కు గురి పెట్టిన చెన్నై..! పూర్తి వివరాలు

|

Sep 24, 2021 | 9:10 AM

IPL 2021 Mumbai Indians: మొదటి ఫేజ్‌లో కూడా ముంబై అద్భుతంగా రాణించింది. అయితే అసలు ఇప్పుడేమైంది.. రోహిత్ సేన అంతగా ప్రభావం..

1 / 7
యూఏఈ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్ థ్రిల్లింగ్‌గా సాగుతోంది. పాయింట్స్ పట్టికలో మార్పులు రావడంతో.. టాప్ 4 స్థానాల్లో ఫైనల్‌కు ఎవరు ఉంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

2 / 7
గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్‌కు తిరుగులేదు. ఈ సీజన్ మొదటి ఫేజ్‌లో కూడా ముంబై అద్భుతంగా రాణించింది. అయితే అసలు ఇప్పుడేమైంది.. రోహిత్ సేన అంతగా ప్రభావం చూపలేకపోతోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్, నిన్న కేకేఆర్ మ్యాచ్‌లోనూ ముంబై తేలిపోయింది. ప్రత్యర్ధులకు గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. ఇక ఇందుకు భిన్నంగా కేకేఆర్ రెండో ఫేజ్‌లో విజృంభిస్తోంది. వరుసగా రెండు విజయాలతో పాయింట్స్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబై ఆరో స్థానానికి పడిపోయింది.

3 / 7
యధాతధంగా తమ ఫామ్‌ను కొనసాగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కూడా విజయాల పరంపరను కొనసాగిస్తూ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బెంగళూరు 10 పాయింట్స్‌తో, కేకేఆర్ 8 పాయింట్స్‌తో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక నిన్నటి పరాభవంతో రోహిత్ సేన ఆరో స్థానానికి పడిపోయింది.

4 / 7
ఆరెంజ్ క్యాప్: శిఖర్ ధావన్(422) అగ్రస్థానంలో.. కెఎల్ రాహుల్(380) రెండో స్థానంలో.. మయాంక్ అగర్వాల్(327), డుప్లెసిస్(320), పృథ్వీ షా(319)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

5 / 7
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్(17 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆవేశ్ ఖాన్(14 వికెట్లు) రెండు, క్రిస్ మోరిస్(14 వికెట్లు), అర్ష్‌దీప్ సింగ్(12 వికెట్లు), రషీద్ ఖాన్(11 వికెట్లు)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

6 / 7
నేటి మ్యాచ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే అగ్రస్థానానికి వెళ్తుంది. అలాగే బెంగళూరు అత్యధిక రన్‌రేట్‌తో గెలిస్తే మాత్రం.. ముంబైకు కొంచెం కష్టతరం అవుతుంది.

7 / 7
ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. అందులో రెండు.. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ల నుంచి రావడం గమనార్హం. సంజూ శాంసన్(119), జోస్ బట్లర్(124), దేవ్‌దూత్ పడిక్కల్(101) ఈ జాబితాలో ఉన్నారు.