మరోసారి ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. ఆడేందుకు నేను రెడీ అంటోన్న హార్దిక్ పాండ్యా..?

Updated on: Oct 30, 2026 | 6:02 PM

ముంబై ఇండియన్స్ (Mumbai Indians)లో ఐపీఎల్ 2027కు ముందే కీలక మార్పులపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ట్రేడ్ కాకపోతే రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ఆడేందుకు అంగీకరించినట్లు ఓ నివేదిక పేర్కొంది. దీంతో ముంబై ఫ్రాంచైజీలో కెప్టెన్సీపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

1 / 5
ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను తిరిగి జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలపై ఫ్రాంచైజీ చర్చలు జరుపుతున్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (The Indian Express) నివేదిక పేర్కొంది.

2 / 5
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హార్దిక్‌ను మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయడం కుదరకపోతే.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడేందుకు పాండ్యా అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. హార్దిక్ 2024లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) నుంచి ముంబై జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే అతడి కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో ఐపీఎల్ 2027కు ముందు జట్టు నిర్మాణంలో భారీ మార్పులు మొదలయ్యాయి.

3 / 5
ఇటీవల ముంబై తమ కోచింగ్ బృందాన్ని కూడా మార్చింది. కీరన్ పొలార్డ్ (Kieron Pollard)ను హెడ్ కోచ్‌గా నియమించగా, రాబిన్ ఉతప్ప (Robin Uthappa), మిచెల్ మెక్లెనగన్ (Mitchell McClenaghan), ధవల్ కులకర్ణి (Dhawal Kulkarni), టీ దిలీప్ (T Dilip)కు కోచింగ్ బృందంలో బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

4 / 5
రోహిత్‌ను మళ్లీ కెప్టెన్ చేయాలని నిర్ణయమా? రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అతడి నాయకత్వంలో ముంబై ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచింది. ఇప్పుడు మరోసారి అతడినే కెప్టెన్‌గా తీసుకురావాలనే ఆలోచన ఫ్రాంచైజీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత రోహిత్ స్వయంగా తిలక్ వర్మ (Tilak Varma) పేరును కెప్టెన్సీ అభ్యర్థిగా సూచించినట్లు నివేదిక పేర్కొంది. కానీ ఫ్రాంచైజీ మాత్రం రోహిత్‌నే తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు సమాచారం.

5 / 5
ఈ విషయంపై రోహిత్‌తో ముంబై యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సమయంలోనూ ముంబై కష్టాల్లో ఉన్న దశలో హార్దిక్ స్థానంలో రోహిత్‌ను మధ్యలోనే కెప్టెన్ చేయాలని ఫ్రాంచైజీ ప్రయత్నించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కాకపోతే నిజంగానే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై తరఫున కొనసాగుతాడా? ఐపీఎల్ 2027కు ముందు ముంబై తీసుకునే నిర్ణయం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us