IPL 2027 Auction: రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి.. అన్ సోల్డ్‌గానే ఈ ఐదుగురు.. లిస్ట్ చూస్తే షాకే..!

Updated on: Nov 28, 2026 | 9:25 AM

IPL Auction 2027 Unsold Players: డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలం కోసం 1220 మంది ప్లేయర్లు నమోదు చేసుకున్నారు. అందులో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన ఈ 5 స్టార్ ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలే ఛాన్సే ఎక్కువగా ఉంది.

1 / 7
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ 25, బుధవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వివరాలను వెల్లడించింది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలం కోసం మొత్తం 1220 మంది ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 939 మంది భారత ప్లేయర్లు కాగా.. 17 దేశాల నుంచి 281 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. షార్ట్‌లిస్ట్ జాబితా డిసెంబర్ 4న వెల్లడికానుంది. ఈ క్రమంలో అత్యధిక బేస్ ప్రైస్ రూ.2 కోట్లతో బరిలోకి దిగినా.. కొనేవారు లేక అన్‌సోల్డ్‌గా మిగిలే 5 స్టార్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 7
1. డేవిడ్ వార్నర్.. వయసు 40.. కొనేవారెవరు..? 2024 తర్వాత ఐపీఎల్‌కు దూరమైన డేవిడ్ వార్నర్.. మళ్లీ మినీ వేలంలోకి వచ్చి సంచలనం సృష్టించాడు. మధ్యలో పీఎస్ఎల్‌లో కరాచీ కింగ్స్ తరఫున ఆడిన వార్నర్.. పీఎస్ఎల్ 2026లో 7 ఇన్నింగ్స్‌లలో 51.20 సగటు, 147.98 స్ట్రయిక్ రేట్‌తో 256 పరుగులు చేశాడు. ఫామ్ పరంగా ఫర్వాలేదనిపించినా.. వయసు 40 కావడంతో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవచ్చు. అందుకే మాజీ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అన్‌సోల్డ్‌గా మిగిలే ఛాన్సే ఎక్కువ.

3 / 7
2. డెవాన్ కాన్వే.. పాత కాన్వే కాదుగా..! ఐపీఎల్ 2026 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన డెవాన్ కాన్వే.. వార్నర్ బాటలోనే పీఎస్ఎల్‌కు వెళ్లాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్ఎల్ 2026లో 11 ఇన్నింగ్స్‌లలో 35 సగటు, 129 స్ట్రయిక్ రేట్‌తో 315 పరుగులు చేశాడు. 35 ఏళ్ల కాన్వే.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడినప్పటి ఫామ్‌లో లేకపోవడంతో ఐపీఎల్ 2027లోనూ అతడిని పట్టించుకునేవారు ఉండకపోవచ్చు.

4 / 7
3. రచిన్ రవీంద్ర.. ఫామ్ లేదు.. ధర ఎక్కువ..! కేకేఆర్ రిలీజ్ చేసిన రచిన్ రవీంద్ర ప్రస్తుతం ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత MLC, ది హండ్రెడ్‌లో 30 కంటే తక్కువ సగటుతో నిరాశపరిచాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో 7 ఇన్నింగ్స్‌లలో 25.80 సగటు, 134.38 స్ట్రయిక్ రేట్‌తో 129 పరుగులే చేశాడు. ప్రస్తుత ఫామ్‌కు రూ.2 కోట్లు చాలా ఎక్కువ. అందుకే అన్‌సోల్డ్ అయ్యే అవకాశమే ఎక్కువ.

5 / 7
4. ఆన్రిచ్ నోర్జే.. గాయాలతో సతమతం..! రూ.2 కోట్లతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ ఆన్రిచ్ నోర్జేపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవచ్చు. గాయాల జాబితా ఎక్కువ కావడంతో డబ్బు పెట్టేందుకు జట్లు వెనుకాడుతున్నాయి. ఐపీఎల్ 2026లో కేవలం 1 మ్యాచ్ ఆడి 9.78 ఎకానమీతో వికెట్ లేకుండా వెనుదిరిగాడు. మధ్యలోనే గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. అందుకే ఐపీఎల్ 2027 ఆడటం కష్టమే.

6 / 7
5. వనిందు హసరంగ.. ఫిట్‌నెస్ లేదు.. వికెట్లూ లేవు..! నోర్జే మాదిరిగానే శ్రీలంక స్టార్ వనిందు హసరంగ కూడా ఫిట్‌నెస్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గాయంతో ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యాడు. CPL, LPLలో తిరిగొచ్చినా వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. ఫామ్ తగ్గడం, ఫిట్‌నెస్ ఆందోళనలతో హసరంగపై ఏ జట్టు ఆసక్తి చూపకపోవచ్చు.

7 / 7
మొత్తంగా చూస్తే.. పేరుకు స్టార్లే అయినా.. వయసు, ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో ఈ 5గురు రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌కు తగ్గట్లుగా కనిపించడం లేదు. మరి డిసెంబర్ 16 వేలంలో వీరి ఫేట్ ఏంటో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us